Thursday, December 1, 2011

కళ్ల కింద నల్లని వలయాలు తగ్గాలంటే

 కళ్ల కింద నల్లని వలయాలు తగ్గాలంటే
కళ్ల కింద నల్లని వలయాలు తగ్గాలంటే... చల్లటి దోసరసంలో దూదిని ముంచి కనురెప్పల మీద పెట్టుకొని పదిహేను నిమిషాల సేపు విశ్రాంతి పొందాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. బంగాళదుంప రసాన్ని కూడా ఇందుకోసం ఉపయోగించవచ్చు.

Thursday, November 24, 2011

చలికాలం శిరోజాలకు మేలు చేసే ప్యాక్...

చలికాలం శిరోజాలకు మేలు చేసే ప్యాక్... 
మగ్గిన అరటిపండు, గుడ్డులోని తెల్లసొన, రెండు టేబుల్‌స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్ల పాలు, మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, కేశాలకు పట్టించి ఇరవై నిమిషాలు వదిలేసి,తర్వాత తలస్నానం చేయాలి. 

Monday, November 14, 2011

పచ్చి అరటి ముక్కలను ఒక ఉడుకు రానిచ్చి

పచ్చి అరటి ముక్కలను ఒక ఉడుకు రానిచ్చి తీసి వేయిస్తే అవి మృదువుగా వస్తాయ్. అలాగే రుచిగా ఉంటాయ్.

Monday, November 7, 2011

కొత్తిమీర మీర పొడి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే?

కొత్తిమీర మీర పొడి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే?
కొత్తిమీర మీర పొడికి కొద్దిగా ఉప్పు చేర్చి నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉండి మంచి వాసన వస్తుంది.

వాడని ప్లాస్క్ వాసన రాకుండా ఉండాలంటే

వాడని ప్లాస్క్ వాసన రాకుండా ఉండాలంటే 
 వాడని ప్లాస్క్ వాసన రాకుండా ఉండాలంటే రెండు లవంగాలు వేస్తె వాసన రాకుండా ఉంటాయీ.

Friday, November 4, 2011

చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే?

 చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే?
చిన్న కీరా ముక్కను మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో రెండు టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. రోజు విడిచి రోజు ఈ మిశ్రామాన్ని ప్యాక్‌లా వాడటం వల్ల చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.

Thursday, November 3, 2011

సౌందర్య చిట్కా

 సౌందర్య చిట్కా 
ఆలివ్ ఆయిల్‌ను రోజూ ముఖానికి రాసుకొని మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ వృద్ధి చెంది, చర్మం బిగుతుగా తయారవుతుంది.

చుండ్రు తగ్గాలంటే

 చుండ్రు తగ్గాలంటే 
ఆలివ్ ఆయిల్, తేనె సమపాళ్లలో తీసుకొని మాడుకు, కేశాలకు పట్టించాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది. పొడి జుట్టుకు ఆలివ్ ఆయిల్, తేనె కండిషనర్‌గా పనిచేస్తాయి.

Wednesday, November 2, 2011

సౌందర్య చిట్కా

 సౌందర్య చిట్కా 
ఆలివ్ ఆయిల్, పంచదారలను సమపాళ్లలో తీసుకొని మెడ, వీపు భాగాల మీద రాసి, 5-10 నిమిషాలు రబ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారంలో 3-4 సార్లు ఇలా చేస్తే నలుపు తగ్గి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

Tuesday, November 1, 2011

కుంకుడు లో ఔషధ విలువలు

కుంకుడు లో ఔషధ విలువలు
  1. కుంకుళ్లకు సమానంగా మిరియాలు కలిపి నీటితో నూరి, రసం తీసి 4, 5 చుక్కల రసాన్ని ముక్కులో వేసుకుని పీలిస్తే మైగ్రేన్ మటుమాయం అవుతుంది.  
  2. కుంకుడు గింజలను కాల్చి పొడి చేసి దానికి సమానంగా పొంగించి పొడి చేసిన పటికను కలిపి దానితో పళ్లు తోముకుంటుంటే పంటిజబ్బులు నశిస్తాయి. 
  3. కుంకుడు గింజలలో ఉండే పప్పును వెనిగర్‌లో కలిపి మెత్తగా నూరి విషకీటకాలు కుట్టినచోట లేపనం చేస్తే నొప్పి, మంట తగ్గుతాయి.
  4. కుంకుడు గింజలోని పప్పును చూర్ణం చేసి దానికి సమానంగా పాతబెల్లం కలుపుకుని కప్పు పాలలో కలుపుకుని తాగుతుంటే వీర్యవృద్ధి అవుతుంది.

బ్యూటీ టిప్స్

 బ్యూటీ టిప్స్
అరకప్పు ఓట్‌మీల్‌లో పావు కప్పు వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకొని ముఖానికి, మెడకు రాసి నెమ్మదిగా మర్దనా చేయాలి. మిగిలిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసి ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. మూడు-నాలుగు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది.

Sunday, October 9, 2011

ప్లాస్టిక్ వస్తువులుకు అంటిన నూనె మరకలు వదలాలంటే

 ప్లాస్టిక్ వస్తువులుకు అంటిన నూనె మరకలు వదలాలంటే
ప్లాస్టిక్ వస్తువులుకు అంటిన నూనె మరకలు వదలాలంటే వంటసోడలో నీళ్ళు కలిపి ఆ మిశ్రమంతో రుద్ది కడిగితే సరి.

Sunday, September 25, 2011

ఉల్లిపాయలు పొట్టు సులువగా రావాలంటే

ఉల్లిపాయలు ఎక్కువ తరగాల్సి వస్తే వాటిని వేడినీళ్ళలో మునిగే వరకు ఉంచి కాసేపయ్యాక తీస్తే పొట్టు సులువగా వస్తుంది.

Tuesday, March 15, 2011

బ్లాక్ హెడ్స్ పోవాలంటే...

బ్లాక్ హెడ్స్ పోవాలంటే...
ముందుగా మూడు కప్పుల నీటిని మరిగించి, అందులో రెండు టేబుల్ స్పూన్ల వంటసోడా వేసి, ఈ నీటిలో టవల్‌ను ముంచి ముఖానికి అద్దుతూ ఉండాలి. ఇలా ఐదారుసార్లు చేసిన తర్వాత వరిపిండిలో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రాసి ఐదు నిమిషాల పాటు వలయాకారంగా రుద్దాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి.

పుదీనా పచ్చడి చేసేటప్పుడు

 పుదీనా పచ్చడి చేసేటప్పుడు
పుదీనా పచ్చడి చేసేటప్పుడు కొద్దిగా పెరుగు కూడా కలిపితే రంగూ రుచీ బాగుంటాయి.

Monday, March 14, 2011

మొటిమలు పోవాలంటే

 మొటిమలు పోవాలంటే
  • బాదంపప్పును పాలతో కలిపి చిక్కటి పేస్టు చేసి మొటిమలపై రాయండి. మొటిమలు మెత్తబడి త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా పడవు.


  • ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలు నీటిలో నానబెట్టి పేస్టు చేసి మొటిమలపై రాసి అరగంట తర్వాత చన్నీటిలో కడిగితే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.

చపాతి పిండి పల్చగా అయి రోటీలు చేయడానికి వీలులేకుండా ఉంటే

 చపాతి పిండి పల్చగా అయి రోటీలు చేయడానికి వీలులేకుండా ఉంటే
చపాతి పిండి పల్చగా అయి రోటీలు చేయడానికి వీలులేకుండా ఉంటే ఓ ఐదునిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టండి.

Sunday, March 13, 2011

పేస్ ప్యాక్

 పేస్ ప్యాక్ 
నాలుగైదు స్ట్రాబెర్రీలను మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలకు రెండు మూడు సార్లు చేస్తే చర్మం నునుపుగా ఉండి, మంచి ఛాయ వస్తుంది.

వంటింటి చిట్కా

 వంటింటి చిట్కా 
కప్పు నీటిలో వాడేసిన నిమ్మచెక్కలు, లవంగాలు వేసి మరిగించి దాన్ని ఓవెన్‌లో ఉంచితే.. పదార్థాల తాలూకు వాసనలు రావు.

Thursday, March 10, 2011

ఉడికించిన బంగాళాదుంపలను

ఉడికించిన బంగాళాదుంపలను

ఉడికించిన బంగాళాదుంపలను ఎగ్‌ స్త్లెసర్‌తో కోస్తే ముక్కలు చక్కగా వస్తాయి.

Tuesday, March 8, 2011

ఎండలో బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ముఖాన్ని

 ఎండలో బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ముఖాన్ని
  • ఎండలో బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ముఖాన్ని కీరదోస ముక్కతో రుద్ది కడిగితే చర్మం నల్లబడదు.
  • గోళ్లు పెళుసుబారి విరుగుతుంటే... రసం పిండేసిన నిమ్మచెక్కతో రుద్దాలి.
  • మోచేతుల దగ్గర చర్మం మృదువుగా రావాలంటే ముల్లంగి ముక్కతో రుద్దాలి లేదా ముల్లంగా రసాన్ని రాస్తే సరి.

Sunday, March 6, 2011

ఇంట్లో గాజు వస్తువులు పగిలినప్పుడు

 ఇంట్లో గాజు వస్తువులు పగిలినప్పుడు
ఇంట్లో గాజు వస్తువులు పగిలినప్పుడు మెత్తగా ఉన్న బ్రెడ్‌తో నేలను తుడిస్తే ముక్కలన్ని అతు క్కుపోతాయి.

Thursday, March 3, 2011

పెదవులు నల్లగా ఉంటే

 పెదవులు నల్లగా ఉంటే
పెదవులు నల్లగా ఉంటే... కొద్దిగా వెన్న తీసుకుని రెండు గ్లిజరిన్ చుక్కలు వేసి కలిపి రాయాలి. ఇలా వారానికి మూడు-నాలుగు సార్లు రాస్తుంటే క్రమంగా నలుపు వదిలి పెదవులు ఆకర్షణీయంగా మారుతాయి.

ఓవెన్‌లో దుర్వాసనలు వస్తుంటే

 ఓవెన్‌లో దుర్వాసనలు వస్తుంటే
దాల్చిన చెక్క పొడిలో చిటికెడు ఉప్పు కలిపి ఓవెన్‌లో ఉంచితే అందులో నుంచి వచ్చే దుర్వాసనలు దూరమవుతాయి.

Wednesday, March 2, 2011

దుస్తులపై పడిన సిరా మరకలు పోవాలంటే

 దుస్తులపై పడిన సిరా మరకలు పోవాలంటే
దుస్తులపై పడిన సిరా మరకలు పోవాలంటే.. ఆ ప్రాంతంపై ఉప్పు చల్లి.. ఆ తరవాత గోరువెచ్చని నీటితో ఉతికి ఆరేయండి.

Tuesday, March 1, 2011

సౌందర్య చిట్కా

 సౌందర్య చిట్కా 
మూడు టీస్పూన్ల టొమాటో రసంలో టీస్పూను తేనె కలిపి ముఖానికి రాసుకుంటూ ఉంటే, కొద్దిరోజుల్లోనే కాంతివంతమైన ఛాయ మీ సొంతమవుతుంది.

బెండకాయ వేపుడు చేస్తున్నప్పుడు

 బెండకాయ వేపుడు చేస్తున్నప్పుడు
బెండకాయ వేపుడు చేస్తున్నప్పుడు నూనె ఎక్కువగా పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. కొద్దిగా పెరుగు వేయండి. దానివల్ల కూరముక్కలు ఒకదానికి ఒకటి అతుక్కోవు.

Monday, February 28, 2011

మొటిమలు తగ్గాలంటే

 మొటిమలు తగ్గాలంటే
  1. బాదంపప్పును పాలతో కలిపి చిక్కటి పేస్టు చేసి మొటిమలపై రాయండి. మొటిమలు మెత్తబడి త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా పడవు.
  2. ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలు నీటిలో నానబెట్టి పేస్టు చేసి మొటిమలపై రాసి అరగంట తర్వాత చన్నీటిలో కడిగితే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.

దుస్తులపై నూనె మరకలు పడిన వెంటనే

దుస్తులపై నూనె మరకలు పడిన వెంటనే
దుస్తులపై నూనె మరకలు పడిన వెంటనే.. కొద్దిగా వంటసోడా లేదా మొక్కజొన్న పిండి చల్లి.. ఆ తరవాత దులిపేయండి. ఇది నూనెను పీల్చేస్తుంది.

Thursday, February 24, 2011

ముడతలు తగ్గాలంటే...

ముడతలు తగ్గాలంటే...

టీ స్పూన్ ఓట్స్ పొడిలో టీ స్పూన్ ఆపిల్ గుజ్జు, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పచ్చిపాలు కలిపి, ముఖానికి రాసి 20 ని.ల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగాలి. వారానికి రెండుసార్లిలా చేస్తే ముడతలు తగ్గుతాయి.

Wednesday, February 23, 2011

సౌందర్య చిట్కా

 సౌందర్య చిట్కా 
రెండు టీ స్పూన్ల పచ్చిపాలలో రెండు టీ స్పూన్ల ఓట్స్ పొడి, చిటికెడు చందనంపొడి, చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కోమలంగా తయారవుతుంది.

Sunday, February 20, 2011

బూట్లను విడిచిన వెంటనే దుర్వాసన వస్తుంటే

 బూట్లను విడిచిన వెంటనే దుర్వాసన వస్తుంటే
బూట్లను విడిచిన వెంటనే వాటిలో కొద్దిగా బేకింగ్‌ సోడాని ఉంచితే అది దుర్వాసనని పీల్చుకుంటుంది.

Thursday, February 17, 2011

వెల్లుల్లిపాయల పొట్టు సులువుగా రావాలంటే

 వెల్లుల్లిపాయల పొట్టు సులువుగా రావాలంటే

 
వెల్లుల్లిపాయలకు కొన్ని చుక్కలు నూనె పట్టించి రోజుంతా ఎండలో ఉంచండి. సాయంత్రం దళసరి వస్త్రంలో రెబ్బల్ని ఉంచి.. గట్టిగా రుద్దితే పొట్టు సులువుగా వూడివచ్చేస్తుంది.

Monday, February 14, 2011

చుండ్రు నివారణకు...

 చుండ్రు నివారణకు...
ఒక కప్పు పెరుగులో, టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తల కుదుళ్లకు బాగా పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చొప్పున రెండు నెలలపాటు చేస్తే చుండ్రు పోతుంది.

Sunday, February 6, 2011

మొటిమలతో వచ్చిన మచ్చలు తగ్గాలంటే...

 మొటిమలతో వచ్చిన మచ్చలు తగ్గాలంటే...
మొటిమలతో వచ్చిన మచ్చలు తగ్గాలంటే... వేపాకులను మెత్తగా పేస్ట్ చేసి చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని మచ్చలు ఉన్నచోట పలుచని పొరలా అప్లై చేసి, పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తేడా కనిపిస్తుంది.

గారెల పిండి పలచగా ఉంటే

 గారెల పిండి పలచగా ఉంటే
 
 
గారెల పిండి పలచగా ఉంటే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. అందుకని ఆ పిండిలో రెండు టీ స్పూన్ల నెయ్యి కలిపితే నూనె లాగడం తగ్గి గారెలు చక్కగా వస్తాయి.

Friday, February 4, 2011

ఎరుపురంగు దుస్తులు రంగు వెలుస్తుంటే

 ఎరుపురంగు దుస్తులు రంగు వెలుస్తుంటే
ఎరుపురంగు దుస్తులు ఉతుకుతున్నప్పుడు రంగు వెలిసిపోతుంటాయి ఒక్కోసారి. అలా కాకుండా ఉండాలంటే.. ఆ దుస్తులను ఓసారి అరకప్పు వెనిగర్‌ కలిపిన నీటిలో కాసేపు ఉంచి ఆ తరవాత ఉతకండి.

Thursday, February 3, 2011

మందంగా ఉన్న వస్త్రాలను కుట్టడం కష్టంగా ఉంటె

 మందంగా ఉన్న వస్త్రాలను కుట్టడం కష్టంగా ఉంటె 
కాస్త మందంగా ఉన్న వస్త్రాలను కుట్టడం కొన్నిసార్లు కష్టమవుతుంటుంది. అలాంటప్పుడు ఆ వస్త్రంపై ముందుగా కొవ్వొత్తి రుద్ది కుడితే మీ పని సులువు.

Wednesday, February 2, 2011

కేశాలకు ప్రొటీన్ ప్యాక్...

కేశాలకు ప్రొటీన్ ప్యాక్...
ఒక బౌల్‌లోకి అర కప్పు పెసరపిండి తీసుకుని దానిలో కీరా ముక్కల తురుము, ఆరెంజ్ జూస్, ఒక కోడిగుడ్డు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను నిలవ ఉంచకుండా తాజాగా ఉన్నప్పుడే ఉపయోగించాలి. ముందు రోజు సాయంత్రం షాంపూతో తలస్నానం చేసి మర్నాడు ఉదయం ఈ ప్యాక్‌ను జుట్టు మొత్తం పట్టించాలి. 20 నిమిషాలపాటు ప్యాక్‌ను ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టుకు పోషణ లభించి ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.

ఆకుకూర వండేటప్పుడు

 ఆకుకూర వండేటప్పుడు
ఆకుకూర వండేటప్పుడు అందులో జీలకర్రపొడి వేస్తే కూర సువాసన వస్తుంది. కమ్మగానూ ఉంటుంది.

Tuesday, February 1, 2011

చర్మం కాంతిమంతంగా ఉండాలంటే

 చర్మం కాంతిమంతంగా ఉండాలంటే
రెండు టీ స్పూన్ల అరటిపండు గుజ్జులో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పచ్చిపాలు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదారు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కాంతిమంతంగా ఉంటుంది.

కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే

కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే 
 కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే నిమిషం పాటు గోరువెచ్చని  నీటిలో నానబెట్టి గరుకు రాయి తో రెండు రోజుల పాటు రుద్దితే  కాళ్ళ పగుళ్ళు తగ్గుముఖం పడతాయి.

Monday, January 31, 2011

కేక్స్ తయారు చేసుకునేటప్పుడు గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే

 కేక్స్ తయారు చేసుకునేటప్పుడు గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే
పుడ్డింగ్స్ లేదా కేక్స్ తయారు చేసుకునేటప్పుడు గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే నిమ్మకాయ తొక్క తురుమును చిటికెడు కలుపుకుంటే సరిపోతుంది.

Sunday, January 30, 2011

సౌందర్య చిట్కా

 సౌందర్య చిట్కా 

తాజా గులాబీ రేకులలో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు కలిపి మెత్తగా పేస్ట్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కోమలంగా ఉంటుంది.

గ్యాస్‌ స్టౌ ఉంచే ప్రాంతాన్ని

 గ్యాస్‌ స్టౌ ఉంచే ప్రాంతాన్ని
గ్యాస్‌ స్టౌ ఉంచే ప్రాంతాన్ని తినే సోడా కలిపిన నీటితో కడిగితే త్వరగా శుభ్రపడుతుంది.

Friday, January 28, 2011

క్యాలీఫ్లవర్‌ను తరగడానికి ముందు

 క్యాలీఫ్లవర్‌ను తరగడానికి ముందు


క్యాలీఫ్లవర్‌ను తరగడానికి ముందు ఉప్పు నీళ్లలో పావుగంట ఉంచితే పురుగుల సమస్య ఉండదు.

Wednesday, January 26, 2011

పుదీనా, కొత్తిమీర చట్నీ చేసేటప్పుడు

 పుదీనా, కొత్తిమీర చట్నీ చేసేటప్పుడు

పుదీనా, కొత్తిమీర చట్నీ చేసేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

Tuesday, January 25, 2011

హ్యాండ్‌బ్యాగు జిప్పు పట్టనప్పుడు

 హ్యాండ్‌బ్యాగు జిప్పు పట్టనప్పుడు 
లికాలంలో హ్యాండ్‌బ్యాగు జిప్పు ఓ పట్టాన పట్టదు. అలాంటప్పుడు కొద్దిగా కాండిల్(కొవ్వతి) దానిపై రుద్దండి. సులువుగా వస్తుంది.

జుట్టు ఊడటం తగ్గాలంటే

 జుట్టు ఊడటం తగ్గాలంటే
జుట్టు ఊడటం తగ్గాలంటే- మొదటగా అరకప్పు మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ చేసి అందులో అర కప్పు పుల్లటి పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల పాటు ఉంచుకుని గోరువెచ్చని నీటితో తల స్నానం చెయ్యాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టు ఊడటం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

Sunday, January 23, 2011

పచ్చి బఠాణీల రంగు మారకుండా ఉండాలంటే

 పచ్చి బఠాణీల రంగు మారకుండా ఉండాలంటే

పచ్చి బఠాణీల రంగు మారకుండా ఉండాలంటే బఠాణీలు ఉడుకుతున్నప్పుడు చిటికెడు పంచదార కలపాలి.

Saturday, January 22, 2011

జుట్టు ఒత్తుగా పెరగాలంటే

 జుట్టు ఒత్తుగా పెరగాలంటే
జుట్టు ఒత్తుగా పెరగాలంటే తల స్నానం చేయబోయే గంట ముందు గోరువెచ్చని కొబ్బరినూనెను తలకు పట్టించాలి. తగినన్ని మందార ఆకులను శుభ్రంగా కడిగి గ్రైండ్ చేయాలి. ఆ ముద్దను కూడా తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే జుట్టుకి పోషణ లభించి నల్లగా ఉంటుంది.

పెరుగులోని పులుపు తగ్గాలంటే

పెరుగులోని పులుపు తగ్గాలంటే


పెరుగులోని పులుపు తగ్గాలంటే ఆరు కప్పుల నీళ్లు పోసి ఆరగంట తర్వాత పై నీటిని తీసేస్తే సరిపోతుంది.

Friday, January 21, 2011

కూరల్లో ఉప్పు ఎక్కువైతే

 కూరల్లో ఉప్పు ఎక్కువైతే
కూరల్లో ఉప్పు ఎక్కువైతే రెండు టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కలుపుకుంటే తగ్గుతుంది.

Thursday, January 20, 2011

వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే

 వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే

వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే.. ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. పొట్టు కూడా సులువుగా వస్తుంది.

Wednesday, January 19, 2011

ముఖం కాంతిమంతంగా ఉండాలంటే

 ముఖం కాంతిమంతంగా ఉండాలంటే
ముఖం కాంతిమంతంగా ఉండాలంటే రెండు టీ స్పూన్ల ఓట్స్‌లో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు అయిదారు చుక్కల తేనె కలిపి మెత్తగా పేస్ట్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.

దోసెలు మెత్తగా రావాలంటే

 దోసెలు మెత్తగా రావాలంటే


దోసెలు మెత్తగా రావాలంటే పిండి రుబ్బుకునేటప్పుడు అరకప్పు ఉడికించిన అన్నం, చిటికెడు మెంతిపొడి కలిపితే చాలు.

Tuesday, January 18, 2011

చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా రావాలంటే

 చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా రావాలంటే
ఒక కప్పు గోరింటాకు, ఉసిరికాయ ముక్కలు పదింటిని నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు గ్రైండ్ చేయాలి. దానిని 200 మి.లీల కొబ్బరి నూనెలో వేసి సన్నని మంట మీద మరగబెట్టి చల్లారిన తర్వాత వడపోసి బాటిల్‌లో నిలువచేసుకోవాలి. ఈ నూనెను తలకు పట్టిస్తే చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పెరుగు తుంది.

Wednesday, January 12, 2011

పండ్లు తొందరగా పండాలంటే

 పండ్లు తొందరగా పండాలంటే
పండ్లు తొందరగా పండాలంటే న్యూస్ పేపర్‌లో చుట్టి ఏదైనా గూట్లో గాలి తగలకుండా రెండు రోజుల పాటు ఉంచితే సరి.

Tuesday, January 11, 2011

బాదంపప్పు పొట్టు తేలికగా రావాలంటే

 బాదంపప్పు పొట్టు తేలికగా రావాలంటే

బాదంపప్పు పొట్టు తేలికగా రావాలంటే... 20 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి ఒలిస్తే చాలు.

ఆపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే

 ఆపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే

ఆపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే... కట్ చేసిన ముక్కలకు నిమ్మరసం రాస్తే సరి.

Monday, January 10, 2011

ఫ్లవర్ ప్యాక్ ఫర్ డ్రై స్కిన్

ఫ్లవర్ ప్యాక్ ఫర్ డ్రై స్కిన్
బంతిపువ్వు రెక్కలు ఒక కప్పు, చామంతి రెక్కలు ఒక కప్పు ఉడికించి చిదిమిన క్యారెట్ ఒక కప్పు, వీట్‌జెర్మ్ ఆయిల్ ఒక టీ స్పూన్.

అరకప్పు నీటిలో బంతిపూల రెక్కలు, చామంతి రెక్కలు వేసి మరిగించి మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి. క్యారెట్‌లో వీట్‌జెర్మ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని పూల రెక్కలు వేసి మరిగించిన నీటిలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ఇష్టమైతే రెండు మూడు చుక్కల బాదం నూనె కూడా కలుపుకోవచ్చు. ఆ ప్యాక్‌ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని సాధారణ చర్మాన్ని మృదువుగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. ప్యాక్ పట్టించేటప్పుడు పై వైపుకు స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే ముఖం కండరాలు ఉత్తేజితమై, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతంగా ఉంటుంది.


సౌందర్య చిట్కాలు

సౌందర్య చిట్కాలు 
బకెట్‌ గోరువెచ్చని నీటిలో రెండు కప్పుల పాలు చేర్చి, ఆ నీటితో స్నానం చేయడం వల్ల పొడిబారిన చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది.
* అరకప్పు ఓట్స్‌లో కొద్దిగా పుల్ల పెరుగు చేర్చి స్నానం చేయడానికి ముందు నలుగు పెట్టుకొంటే చర్మంలో పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి

Sunday, January 9, 2011

గాజు సిసాలపై పడిన గీతలు పోవాలంటే

 గాజు సిసాలపై పడిన గీతలు పోవాలంటే
గాజు సిసాలపై పడిన గీతలు పోవాలంటే టూత్‌పేస్ట్‌తో లేదా ఏదైనా షాంపుతో రుద్దితే సరి.

Saturday, January 8, 2011

పగిలిన పాదాలు వేధిస్తుంటే

 పగిలిన పాదాలు వేధిస్తుంటే
గిలిన పాదాలు వేధిస్తుంటే కొబ్బరి నూనెకి పెట్రోలియం జెల్లీని కలిపి నిద్రించే ముందు పట్టిస్తే సరి. మృదువుగా ఉంటాయి.

చేప ముక్కలను రోజంతా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లయితే

 చేప ముక్కలను రోజంతా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లయితే

చేప ముక్కలను రోజంతా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లయితే... వాడుకోవడా నికి గంట ముందు బయటకు తీసి టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ఉప్పు వేసి కడగాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు గట్టిబడి వాసన రాకుండా ఉంటాయి.

Tuesday, January 4, 2011

చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే

 చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే
చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే ఆలివ్ ఆయిల్‌ని వంటికి పట్టించి పెసరపిండితో నలుగుపెట్టుకుని స్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం పొడిబారడం తగ్గి కాంతివంతంగా ఉంటుంది.

పట్టుచీరలను ఉతికేటప్పుడు

 పట్టుచీరలను ఉతికేటప్పుడు
పట్టుచీరలను ఉతికేటప్పుడు కొంచెం నిమ్మరసం వేస్తే వాటి రంగు పోకుండా కొత్త వాటిలాగే మెరుస్తాయి.

Sunday, January 2, 2011

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే

 చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే... రాత్రి పడుకోబోయే ముందు టీ స్పూన్ బాదమ్ నూనెలో చిటికెడు చందనం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అయిదారు నిమిషాలు మసాజ్ చేసి ఉదయానే గోరు వెచ్చని నీటితో కడిగి మెత్తని టవల్‌తో తుడవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.
కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo