కుంకుడు లో ఔషధ విలువలు
- కుంకుళ్లకు సమానంగా మిరియాలు కలిపి నీటితో నూరి, రసం తీసి 4, 5 చుక్కల రసాన్ని ముక్కులో వేసుకుని పీలిస్తే మైగ్రేన్ మటుమాయం అవుతుంది.
- కుంకుడు గింజలను కాల్చి పొడి చేసి దానికి సమానంగా పొంగించి పొడి చేసిన పటికను కలిపి దానితో పళ్లు తోముకుంటుంటే పంటిజబ్బులు నశిస్తాయి.
- కుంకుడు గింజలలో ఉండే పప్పును వెనిగర్‌లో కలిపి మెత్తగా నూరి విషకీటకాలు కుట్టినచోట లేపనం చేస్తే నొప్పి, మంట తగ్గుతాయి.
- కుంకుడు గింజలోని పప్పును చూర్ణం చేసి దానికి సమానంగా పాతబెల్లం కలుపుకుని కప్పు పాలలో కలుపుకుని తాగుతుంటే వీర్యవృద్ధి అవుతుంది.
No comments:
Post a Comment