కేశాలకు ప్రొటీన్ ప్యాక్...
ఒక బౌల్‌లోకి అర కప్పు పెసరపిండి తీసుకుని దానిలో కీరా ముక్కల తురుము, ఆరెంజ్ జూస్, ఒక కోడిగుడ్డు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను నిలవ ఉంచకుండా తాజాగా ఉన్నప్పుడే ఉపయోగించాలి. ముందు రోజు సాయంత్రం షాంపూతో తలస్నానం చేసి మర్నాడు ఉదయం ఈ ప్యాక్‌ను జుట్టు మొత్తం పట్టించాలి. 20 నిమిషాలపాటు ప్యాక్‌ను ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టుకు పోషణ లభించి ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.
No comments:
Post a Comment