కేక్స్ తయారు చేసుకునేటప్పుడు గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే
పుడ్డింగ్స్ లేదా కేక్స్ తయారు చేసుకునేటప్పుడు గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే నిమ్మకాయ తొక్క తురుమును చిటికెడు కలుపుకుంటే సరిపోతుంది.Monday, January 31, 2011
కేక్స్ తయారు చేసుకునేటప్పుడు గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే
Sunday, January 30, 2011
సౌందర్య చిట్కా
సౌందర్య చిట్కా
తాజా గులాబీ రేకులలో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు కలిపి మెత్తగా పేస్ట్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కోమలంగా ఉంటుంది.
గ్యాస్ స్టౌ ఉంచే ప్రాంతాన్ని
గ్యాస్ స్టౌ ఉంచే ప్రాంతాన్ని
గ్యాస్ స్టౌ ఉంచే ప్రాంతాన్ని తినే సోడా కలిపిన నీటితో కడిగితే త్వరగా శుభ్రపడుతుంది. Friday, January 28, 2011
క్యాలీఫ్లవర్‌ను తరగడానికి ముందు
Wednesday, January 26, 2011
పుదీనా, కొత్తిమీర చట్నీ చేసేటప్పుడు
పుదీనా, కొత్తిమీర చట్నీ చేసేటప్పుడు
Tuesday, January 25, 2011
హ్యాండ్‌బ్యాగు జిప్పు పట్టనప్పుడు
హ్యాండ్‌బ్యాగు జిప్పు పట్టనప్పుడు
చలికాలంలో హ్యాండ్‌బ్యాగు జిప్పు ఓ పట్టాన పట్టదు. అలాంటప్పుడు కొద్దిగా కాండిల్(కొవ్వతి) దానిపై రుద్దండి. సులువుగా వస్తుంది. జుట్టు ఊడటం తగ్గాలంటే
జుట్టు ఊడటం తగ్గాలంటే
జుట్టు ఊడటం తగ్గాలంటే- మొదటగా అరకప్పు మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ చేసి అందులో అర కప్పు పుల్లటి పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల పాటు ఉంచుకుని గోరువెచ్చని నీటితో తల స్నానం చెయ్యాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టు ఊడటం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.Sunday, January 23, 2011
పచ్చి బఠాణీల రంగు మారకుండా ఉండాలంటే
Saturday, January 22, 2011
జుట్టు ఒత్తుగా పెరగాలంటే
జుట్టు ఒత్తుగా పెరగాలంటే జుట్టు ఒత్తుగా పెరగాలంటే తల స్నానం చేయబోయే గంట ముందు గోరువెచ్చని కొబ్బరినూనెను తలకు పట్టించాలి. తగినన్ని మందార ఆకులను శుభ్రంగా కడిగి గ్రైండ్ చేయాలి. ఆ ముద్దను కూడా తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే జుట్టుకి పోషణ లభించి నల్లగా ఉంటుంది. |
Friday, January 21, 2011
కూరల్లో ఉప్పు ఎక్కువైతే
కూరల్లో ఉప్పు ఎక్కువైతే
కూరల్లో ఉప్పు ఎక్కువైతే రెండు టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కలుపుకుంటే తగ్గుతుంది. Thursday, January 20, 2011
Wednesday, January 19, 2011
ముఖం కాంతిమంతంగా ఉండాలంటే
ముఖం కాంతిమంతంగా ఉండాలంటే
ముఖం కాంతిమంతంగా ఉండాలంటే రెండు టీ స్పూన్ల ఓట్స్‌లో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు అయిదారు చుక్కల తేనె కలిపి మెత్తగా పేస్ట్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.
దోసెలు మెత్తగా రావాలంటే
దోసెలు మెత్తగా రావాలంటే
దోసెలు మెత్తగా రావాలంటే పిండి రుబ్బుకునేటప్పుడు అరకప్పు ఉడికించిన అన్నం, చిటికెడు మెంతిపొడి కలిపితే చాలు.
Tuesday, January 18, 2011
చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా రావాలంటే
చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా రావాలంటే
ఒక కప్పు గోరింటాకు, ఉసిరికాయ ముక్కలు పదింటిని నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు గ్రైండ్ చేయాలి. దానిని 200 మి.లీల కొబ్బరి నూనెలో వేసి సన్నని మంట మీద మరగబెట్టి చల్లారిన తర్వాత వడపోసి బాటిల్‌లో నిలువచేసుకోవాలి. ఈ నూనెను తలకు పట్టిస్తే చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పెరుగు తుంది.
Wednesday, January 12, 2011
పండ్లు తొందరగా పండాలంటే
పండ్లు తొందరగా పండాలంటే
పండ్లు తొందరగా పండాలంటే న్యూస్ పేపర్‌లో చుట్టి ఏదైనా గూట్లో గాలి తగలకుండా రెండు రోజుల పాటు ఉంచితే సరి.
Tuesday, January 11, 2011
బాదంపప్పు పొట్టు తేలికగా రావాలంటే
బాదంపప్పు పొట్టు తేలికగా రావాలంటే
బాదంపప్పు పొట్టు తేలికగా రావాలంటే... 20 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి ఒలిస్తే చాలు.
ఆపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే
ఆపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే
Monday, January 10, 2011
ఫ్లవర్ ప్యాక్ ఫర్ డ్రై స్కిన్
ఫ్లవర్ ప్యాక్ ఫర్ డ్రై స్కిన్
బంతిపువ్వు రెక్కలు ఒక కప్పు, చామంతి రెక్కలు ఒక కప్పు ఉడికించి చిదిమిన క్యారెట్ ఒక కప్పు, వీట్‌జెర్మ్ ఆయిల్ ఒక టీ స్పూన్.
అరకప్పు నీటిలో బంతిపూల రెక్కలు, చామంతి రెక్కలు వేసి మరిగించి మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి. క్యారెట్‌లో వీట్‌జెర్మ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని పూల రెక్కలు వేసి మరిగించిన నీటిలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ఇష్టమైతే రెండు మూడు చుక్కల బాదం నూనె కూడా కలుపుకోవచ్చు. ఆ ప్యాక్‌ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని సాధారణ చర్మాన్ని మృదువుగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. ప్యాక్ పట్టించేటప్పుడు పై వైపుకు స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే ముఖం కండరాలు ఉత్తేజితమై, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
అరకప్పు నీటిలో బంతిపూల రెక్కలు, చామంతి రెక్కలు వేసి మరిగించి మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి. క్యారెట్‌లో వీట్‌జెర్మ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని పూల రెక్కలు వేసి మరిగించిన నీటిలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ఇష్టమైతే రెండు మూడు చుక్కల బాదం నూనె కూడా కలుపుకోవచ్చు. ఆ ప్యాక్‌ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని సాధారణ చర్మాన్ని మృదువుగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. ప్యాక్ పట్టించేటప్పుడు పై వైపుకు స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే ముఖం కండరాలు ఉత్తేజితమై, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
సౌందర్య చిట్కాలు
సౌందర్య చిట్కాలు
బకెట్ గోరువెచ్చని నీటిలో రెండు కప్పుల పాలు చేర్చి, ఆ నీటితో స్నానం చేయడం వల్ల పొడిబారిన చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది. * అరకప్పు ఓట్స్‌లో కొద్దిగా పుల్ల పెరుగు చేర్చి స్నానం చేయడానికి ముందు నలుగు పెట్టుకొంటే చర్మంలో పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి
Sunday, January 9, 2011
గాజు సిసాలపై పడిన గీతలు పోవాలంటే
గాజు సిసాలపై పడిన గీతలు పోవాలంటే
గాజు సిసాలపై పడిన గీతలు పోవాలంటే టూత్‌పేస్ట్‌తో లేదా ఏదైనా షాంపుతో రుద్దితే సరి.
Saturday, January 8, 2011
పగిలిన పాదాలు వేధిస్తుంటే
పగిలిన పాదాలు వేధిస్తుంటే
పగిలిన పాదాలు వేధిస్తుంటే కొబ్బరి నూనెకి పెట్రోలియం జెల్లీని కలిపి నిద్రించే ముందు పట్టిస్తే సరి. మృదువుగా ఉంటాయి.
చేప ముక్కలను రోజంతా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లయితే
చేప ముక్కలను రోజంతా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లయితే
Tuesday, January 4, 2011
చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే
చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే
చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే ఆలివ్ ఆయిల్‌ని వంటికి పట్టించి పెసరపిండితో నలుగుపెట్టుకుని స్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం పొడిబారడం తగ్గి కాంతివంతంగా ఉంటుంది.
పట్టుచీరలను ఉతికేటప్పుడు
పట్టుచీరలను ఉతికేటప్పుడు
పట్టుచీరలను ఉతికేటప్పుడు కొంచెం నిమ్మరసం వేస్తే వాటి రంగు పోకుండా కొత్త వాటిలాగే మెరుస్తాయి.
Sunday, January 2, 2011
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే... రాత్రి పడుకోబోయే ముందు టీ స్పూన్ బాదమ్ నూనెలో చిటికెడు చందనం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అయిదారు నిమిషాలు మసాజ్ చేసి ఉదయానే గోరు వెచ్చని నీటితో కడిగి మెత్తని టవల్‌తో తుడవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.
Subscribe to:
Posts (Atom)