టమాటా సూప్‌కి చక్కని రంగు రావాలంటే
ఇంట్లో చేసుకొనే టమాటా సూప్‌కి చక్కని రంగు రావాలంటే అందులో చిన్న బీట్‌రూట్ ముక్క వేస్తే రంగూ, పోషకాలు రెండూ ఉంటాయి.
Thursday, December 30, 2010
టమాటా సూప్‌కి చక్కని రంగు రావాలంటే
Wednesday, December 29, 2010
సబ్బు ముక్కలు మిగిలిపోతే
సబ్బు ముక్కలు మిగిలిపోతే
సబ్బు ముక్కలు మిగిలిపోతే వాటిని సన్నగా తరిగి సర్ఫ్ లో కలిపి బట్టలు ఉతికితే మంచి వాసన వస్తాయ్ .
పేస్ ప్యాక్
పేస్ ప్యాక్
రెండు స్పూన్ల తొక్కతీసిన టొమాటో గుజ్జులో నాలుగు టీ స్పూన్ల అరటిపండు గుజ్జు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.
Tuesday, December 28, 2010
ఎండకు ముఖం కమిలితే
ఎండకు ముఖం కమిలితే
ఎండకు ముఖం కమిలితే రెండు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో చిటికెడు చందనం పొడి కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలు చేస్తే చర్మం తిరిగి కాంతివంతగా ఉంటుంది.
గిన్నె అడుగు మాడినప్పుడు...
గిన్నె అడుగు మాడినప్పుడు...
గిన్నె అడుగు మాడినప్పుడు దానిని ఎక్కువసేపు కష్టపడి తోమకుండా ఆ గిన్నెలో కొద్దిగా డిష్ సోప్ వేసి నీళ్లు పోసి కొంచెంసేపు చిన్న మంట మీద ఉంచాలి. ఆ తరువాత కడిగితే బాగా శుభ్రపడుతుంది.
Monday, December 27, 2010
ముఖం ఫై ముడతలు తగ్గాలంటే
ముఖం ఫై ముడతలు తగ్గాలంటే
కోడిగుడ్డు తెల్ల సొనలో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ముడతలు తగ్గుతాయి.
Sunday, December 26, 2010
గాజు వస్తువులను వాడేసిన టీ పొడితో రుద్ది కడిగితే
గాజు వస్తువులను వాడేసిన టీ పొడితో రుద్ది కడిగితే వాటిమీద పడిన మరకలు త్వరగా వదిలి శుభ్రపడతాయి.
కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే
కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే
చలికాలంలో పాదాలు పగులుతుంటాయి. ఈ పగుళ్లు తగ్గాలంటే... అర కప్పు కొబ్బరి నూనెలో 10 వేపాకులు, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా రెండు వారాల పాటు పాదాలకు రాసుకుంటే పగుళ్ళు తగ్గి మృదువుగా తయారవుతాయి.
Thursday, December 23, 2010
ముఖం కాంతివంతం కావాలంటే
ముఖం కాంతివంతం కావాలంటే
ముఖం కాంతివంతం కావాలంటే... రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను పట్టించి 20 నిమిషాల పాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి
చొక్కా కాలర్ బాగా మురికి పట్టి నల్లగా అయితే
చొక్కా కాలర్ బాగా మురికి పట్టి నల్లగా అయితే
చొక్కా కాలర్ బాగా మురికి పట్టి నల్లగా అయితే ఆ ప్రాంతంలో టాల్కమ్ పౌడర్‌ను చల్లి సబ్బుతో ఉతికితే సులువుగా శుభ్రపడుతుంది.
Wednesday, December 22, 2010
కోమలమైన చర్మం కోసం
కోమలమైన చర్మం కోసం
కోమలమైన చర్మం కోసం రెండు స్పూన్ల కారట్ గుజ్జు, రెండు స్పూన్ల టొమాటో గుజ్జు కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నునుపవుతుంది.
బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే
బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే
Tuesday, December 21, 2010
మొటిమలు తగ్గాలంటే
మొటిమలు తగ్గాలంటే
చిటికెడు జీలకర్ర పొడిలో ఆరు చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని మొటిమల పై రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేస్తే మొటిమలు వాటి తాలూకు నల్ల మచ్చలు తగ్గుతాయి.
వేయించేటప్పుడు పచ్చిమిర్చి పేలకుండా ఉండాలంటే
వేయించేటప్పుడు పచ్చిమిర్చి పేలకుండా ఉండాలంటే
పచ్చిమిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి.
Monday, December 20, 2010
మట్టి మరకలు త్వరగా వదలాలంటే
మట్టి మరకలు త్వరగా వదలాలంటే
Sunday, December 19, 2010
కుకుంబర్ ఫేస్ మాస్క్
కుకుంబర్ ఫేస్ మాస్క్
కుకుంబర్, ఓట్‌మీల్, పాలమీగడ అన్నీ సమపాళ్ళలో తీసుకుని ముఖానికి బాగా మర్దనా చేయాలి. అరగంట పాటు బాగా ఆరనిచ్చి వేడినీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం నునుపుదేరి కాంతివంతమవుతుంది. Wednesday, December 15, 2010
మచ్చలు లేని మోము కోసం...
మచ్చలు లేని మోము కోసం...
- మచ్చలున్న చోట నిమ్మ చెక్కతో రుద్దాలి.
- ఒక స్పూను తేనె, ఓట్‌మీల్, పెరుగు కలిపి ముఖానికి పట్టించి పదినిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
- ఒక స్పూన్ వెనిగర్‌ను వేడినీళ్లలో కలిపి మచ్చల మీద రాయాలి.
- ఉల్లిరసంలో దూదిని నానబెట్టి పడుకోవడానికి ముందు పదిహేను నిమిషాల పాటు మచ్చల మీద మర్దన చేయాలి.
- ఒక స్పూను ఉల్లిరసానికి ఒక స్పూను తేనె కలిపి మచ్చలున్న చోట రాయాలి.
Tuesday, December 14, 2010
దగ్గు తగ్గాలంటే
దగ్గు తగ్గాలంటే
గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు పంచదార, పావు చెంచా పసుపు, కలిపి పుక్కిలిస్తే దగ్గు సమస్య తగ్గుముఖం పడుతుంది.
Monday, December 13, 2010
గొంతులో నసగా ఉన్నప్పుడు
గొంతులో నసగా ఉన్నప్పుడు
గొంతులో నసగా ఉన్నప్పుడు అల్లం ముక్కను దంచి పాలలో వేసి మరిగించి చక్కెర కలిపి తాగితే సరి.
చర్మం మెరుపు రావాలంటే
టీ స్పూన్ చందనం పొడిలో టీ స్పూన్ పసుపు టీ స్పూన్ పచ్చిపాలు కలపాలి. అలా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది.
Sunday, December 12, 2010
క్యాబేజీ కూర వాసన రాకుండా ఉండాలంటే
క్యాబేజీ కూర వాసన రాకుండా ఉండాలంటే
క్యాబేజీ వండేటప్పుడు అందులో చెంచా నిమ్మరసం కలిపితే కూర వాసన రాకుండా ఉంటుంది.* వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది.
జుట్టు నిగనిగ లాడాలంటే
జుట్టు నిగనిగ లాడాలంటే
తలస్నానం చేసే ముందు ఒక గంట సేపు జుట్టుకి కొబ్బరినూనెను పట్టించాలి. పది స్పూన్ల హెన్నా పౌడర్‌లో నాలుగు స్పూన్ల పుల్లటి పెరుగు, రెండు స్పూన్ల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే జుట్టుకు పోషణ లభించి మెరుస్తూ ఉంటుంది.
Wednesday, December 8, 2010
నిద్రబాగా పట్టాలంటే
నిద్రబాగా పట్టాలంటే
గోరువెచ్చటి నీటిలో ఆరు చుక్కల రోజ్‌వాటర్ వేసి రాత్రి పడుకోబోయే ముందు స్నానం చేస్తే నిద్రబాగా పట్టడమే కాకుండా చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది.
పాత్రలు తళతళా మెరవాలంటే
పాత్రలు తళతళా మెరవాలంటే
వాడేసిన నిమ్మచెక్కలతో జిడ్డు సామాన్లను రుద్ది పాత పేపర్లతో తుడిచిన తర్వాత కడిగితే పాత్రలు తళతళా మెరుస్తాయి.
Sunday, December 5, 2010
కారంపొడి పురుగు పట్టకుండా ఉండాలంటే
కారంపొడి పురుగు పట్టకుండా ఉండాలంటే
కారంపొడి నిల్వ చేసిన డబ్బాలో చిన్న ఇంగువ ముక్క ఉంచితే పురుగు పట్టకుండా ఎక్కువ కాలం ఉంటుంది.
బాగా పండిన టమాటాలు పగిలిపోకుండా ఉండాలంటే
బాగా పండిన టమాటాలు పగిలిపోకుండా ఉండాలంటే
బాగా పండిన టమాటాలు పగిలిపోకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళలో వెయ్యండి.
Saturday, December 4, 2010
పెదవులు ఫై నలుపు పోవాలంటే
పెదవులు ఫై నలుపు పోవాలంటే
టీ స్పూన్ అరటిపండు గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే నల్లని పెదవులు గులాబీరంగులోకి మారతాయి.
నిమ్మరసం మిగిలిపోతే
నిమ్మరసం మిగిలిపోతే
నిమ్మరసం మిగిలిపోతే అందులో కొద్దిగా ఉప్పు వేసి ఫ్రిజ్ లో ఉంచండి. రెండు మూడు రోజులు వాడుకోవచ్చు.
వెండి సామాగ్రి మురికి పోవాలంటే
వెండి సామాగ్రి మురికి పోవాలంటే
నీళ్ళలో కాసిని పచ్చి పాలు కలిపి వెండి సామాగ్రి కడిగితే మురికి సులువుగా వదిలిపోయి శుభ్ర పడతాయి.
Wednesday, December 1, 2010
కంటి కింద నలుపు తగ్గాలంటే
కంటి కింద నలుపు తగ్గాలంటే
రెండు స్పూన్ల చల్లని పాలలో కాటన్ బాల్స్‌ని ముంచి కళ్ళ చుట్టూ వలయాకారంగా మర్ధించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కంటి కింద నలుపు తగ్గి అందంగా ఉంటాయి. మరియు కీరదోసకాయని చక్రాల్లా కోసుకుని కళ్ళమీద పెట్టుకుంటే కంటి అలసట తగ్గుతుంది.
వంట గది గట్టు మీద జిడ్డు తొలగించాలంటే
వంట గది గట్టు మీద జిడ్డు తొలగించాలంటే
- వంట గది గట్టు మీద జిడ్డు తొలగించాలంటే కాస్త వంట సోడా చల్లి పీచుతో రుద్ది కడిగితే శుబ్రపడుతుంది.
- ఆలివ్ నూనెలో కాస్త నిమ్మరసం కలిపి చెక్క సామాగ్రిని రుద్దితే పాలిష్ చేసినట్లు కనపడతాయి.
Tuesday, November 30, 2010
కరివేపాకు కాని కొత్తిమీర కాని ఎండినప్పుడు పారవేయకుండా
కరివేపాకు కాని కొత్తిమీర కాని ఎండినప్పుడు పారవేయకుండా
కరివేపాకు కాని కొత్తిమీర కాని ఎండినప్పుడు దానిని పారవేయకుండా కొద్దిగా నలిపి కూరల్లో వేసుకుంటే పచ్చి కరివేపాకు వేసుకున్నప్పటిలాగే రుచిగా ఉంటుంది.
మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే
మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే
మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోపాటు ముడతలు పోతాయి.
Monday, November 29, 2010
సౌందర్య చిట్కా
సౌందర్య చిట్కా
టీ స్పూన్ కీరదోసకాయ రసంలో చిటికెడు చందనం కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడిగితే చర్మం నునుపు తేలుతుంది.
దురద తగ్గాలంటే
దురద తగ్గాలంటే
Sunday, November 28, 2010
ముఖం ఫై నల్లమచ్చలు తగ్గాలంటే
ముఖం ఫై నల్లమచ్చలు తగ్గాలంటే
టీ స్పూన్ శనగపిండిలో అయిదారు చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మొటిమలు, నల్లమచ్చలు, చర్మం మీద ఉన్న జిడ్డు తగ్గి ముఖం కాంతిమంతంగా అవుతుంది
టీ స్పూన్ శనగపిండిలో అయిదారు చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మొటిమలు, నల్లమచ్చలు, చర్మం మీద ఉన్న జిడ్డు తగ్గి ముఖం కాంతిమంతంగా అవుతుంది
జిగురు గట్టిపడితే
జిగురు గట్టిపడితే
- జిగురు గట్టిపడితే అందులో కాస్త వెనిగర్ కలిపితే మామూలుగా అయిపోతుంది.
- గోళ్ళరంగు సీసాలను ఫ్రిజ్‌లో పెడతే గట్టిపడకుండా ఉంటాయి.
Thursday, November 25, 2010
చర్మం జిడ్డుగా ఉంటె
చర్మం జిడ్డుగా ఉంటె
టీ స్పూన్ తేనెలో కోడిగుడ్డులోని తెల్ల సొన కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగితే జిడ్డు తగ్గి చర్మం అందంగా, కోమలంగా ఉంటుంది.
Wednesday, November 24, 2010
ముఖ సౌందర్యం కోసం
ముఖ సౌందర్యం కోసం
ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. టీ స్పూన్ తేనెలో అయిదారు చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం గల రంధ్రాల్లో చేరిన మురికి వదులుతుంది, చర్మం నునుపుదేలుతుంది.
బట్టలపైన పడిన మరకలు పోవాలంటే
బట్టలపైన పడిన మరకలు పోవాలంటే
బట్టలపైన పడిన మరకలు పోవాలంటే... మరకలు పడిన చోట నిమ్మరసం వేసి తొక్కతో రుద్దాలి. ఆ తరువాత సబ్బుతో ఉతికితే మరకలు మాయమవుతాయి.
Tuesday, November 23, 2010
వంటింటి చిట్కాలు
వంటింటి చిట్కాలు
నిమ్మరసంలో ఉప్పు కలిపి రాగి సామాగ్రిని తోమితే కొత్త వాటిల మెరుస్తాయి.వండిన బాణిలో పదార్ధాలు అంటుకుపోతే అందులో సబ్బు నీళ్ళు పోసి కొద్ది సేపు మరగించి శుబ్రపరిస్తే సరి
మొటిమలు తగ్గాలంటే
మొటిమలు తగ్గాలంటే
టీ స్పూన్ పచ్చిపాలలో అయిదారు చుక్కల తులసి రసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ ముంచి ముఖానికి, మెడకి అప్లై చేసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు తగ్గి ముఖం పొడిబారకుండా ఉండి చర్మం నిగనిగలాడుతుంది.
Sunday, November 21, 2010
చర్మం నునుపుగా ఉండాలంటే
సౌందర్య చిట్కా
ఒక టీ స్పూన్ బాదమ్ ఆయిల్‌లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి మాస్క్ వేసుకుని పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం నునుపుదేలి అందంగా మెరుస్తూ ఉంటుంది.
Saturday, November 20, 2010
మచ్చలు, మొటిమలు తగ్గాలంటే
మచ్చలు, మొటిమలు తగ్గాలంటే
మచ్చలు, మొటిమలు, గాయాలు త్వరగా తగ్గాలంటే మీడియం సైజు బంగాళదుంపను ఉడికించి మెత్తగా చిదిమి అందులో టీ స్పూన్ నిమ్మరసం కలిపి రాయాలి.
చర్మం మృదువుగా ఉండాలంటే
చర్మం మృదువుగా ఉండాలంటే
శీతాకాలంలో సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. స్నానంచేసే ముందు ఒంటికి బాదమ్ ఆయిల్ పట్టించి సున్నిపిండి రాసి మర్దన చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే ఒంటిపై ముడ తలు, దురద తగ్గి చర్మం నునుపుదేలు తుంది. మర్దనతో రక్తప్రసరణ మెరగవుతుంది. చర్మ సౌందర్యంతోపాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది.
దగ్గు తగ్గాలంటే
దగ్గు తగ్గాలంటే
టీ స్పూన్ శొంఠి పొడిలో నాలుగు టీ స్పూన్ల తేనె కలిపి రోజుకి రెండు సార్లు తింటే దగ్గు తగ్గుతుంది.
Thursday, November 18, 2010
వంటింటి చిట్కాలు
వంటింటి చిట్కాలు
ఆమ్లెట్ రుచిగా.. మృదువుగా రావాలి అంటే గుడ్డు సోన గిలకోట్టేటప్పుడు చెంచా పాలు కలిపితే చాలు.
పచ్చి బటాని ఉడికిస్తున్నపుడు వాటి రంగు తగ్గకుండా ఉండాలి అంటే ఆ నీటిలో చెంచా వెనిగర్ వెయ్యాలి.
సౌందర్య చిట్కా
సౌందర్య చిట్కా
ఎండకు కమిలిన చర్మానికి... ఒక టీ స్పూన్ టొమాటో గుజ్జులో ఒక టీ స్పూన్ పుల్లటి పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా రాస్తే, రెండు- మూడు రోజుల్లో చర్మం కోమలమవుతుంది.
Wednesday, November 17, 2010
వంటింటి చిట్కా
వంటింటి చిట్కా
- పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకుంటే మండకుండా ఉంటాయి.
- వంటగదిలో అలోవెరా మొక్కను పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న గాయాలు తగిలినపుడు అలోవెరా ఆకును తెంపి ఆ జెల్‌ను గాయమైన చోట రుద్దితే ఉపశమనం కలుగుతుంది.
సున్నితమైన పెదవుల కోసం
సున్నితమైన పెదవుల కోసం
చలికాలంలో పెదవులు పొడిబారి, పగిలి నిర్జీవంగా కనిపిస్తాయి. ఒక్కోసారి పెదవులపై డెడ్ స్కిన్ ఏర్పడుతుంది. దీనిని బలవంతంగా లాగితే రక్తం వస్తుంది. కాబట్టి ఈ సీజన్‌లో పెదవులు సున్నితంగా ఉండేలా తగినంత శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లోనే దొరికే పదార్థాలతో కొన్ని చిట్కాలు మీ కోసం....
- పుదీనా లేదా కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుని ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
- కొన్ని గులాబీ రేకులను పేస్ట్ చేసి అందులో గ్లిజరిన్ చుక్కలు వేసి రాత్రి పడుకునేటప్పుడు పెదవులకు రాసుకుని ఉదయం కడుక్కోవాలి.
- ఉదయం లేవగానే పెదవులకు తేనె లేదా పాలమీగడ రాసుకుని పావుగంట సేపు ఉంచుకుని కడిగేయాలి. ఇలా నెలరోజుల పాటు చేస్తే పెదవులు సున్నితంగా ఉండడంతో పాటు గులాబీరంగులోకి వస్తాయి.
- రాత్రి పడుకునేటప్పుడు కాటన్‌తో పెదవులను తుడుచుకుని కొబ్బరినూనె లేదా వెన్నను వేలితో అప్లై చేసి రెండుమూడు నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేయాలి.
Monday, November 15, 2010
వంటింటి చిట్కా
వంటింటి చిట్కా
పచ్చళ్ళను నిలవ చేసే గాజు సీసాలు, జాడీలను కొంచెంసేపు ఎండలో పెట్టాలి. అలా చేయడం వల్ల అందు లో నీళ్లన్నీ ఎండిపోయి పచ్చళ్ళు బూజుపట్టకుండా ఎక్కువ కాలం నిలవ ఉంటాయి.
సౌందర్య చిట్కా
సౌందర్య చిట్కా
పెరిగే వయసును అద్దంలా ప్రతిబింబింపజేసేది చర్మం. అందులోనూ చలికాలంలో మరీ ఎక్కువ ముడతలు పడుతుంది. అందుకే ఈ కాలంలో వార్ధక్య లక్షణాలకు చెక్‌పెట్టే హోమ్‌మేడ్ ఫేషియల్ మాస్క్:ఒక నిమ్మకాయను తీసుకుని, గింజలు వేరుచేసి, అందులో ఒక స్పూను మీగడ వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి పొరలా ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత తీసేసి ముఖానికి ఫేషియల్ క్రీమ్ రాసి మర్దన చేయాలి. ముడతలు పడిన చర్మానికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.
వంటింటి చిట్కాలు
వంటింటి చిట్కాలు
- ఉడెన్ ఫర్నిచర్‌ను పేపర్‌తో తుడిస్తే పాలిష్ చేసినట్లు మెరుస్తాయి. పేపర్‌తో తుడవడం వల్ల సందుల్లోని దుమ్ము పూర్తిగా వదలదు కాబట్టి ముందుగా మెత్తటి క్లాత్‌తో తుడిచి, తర్వాత పేపర్‌తో తుడవాలి.
- కూరలో కారం ఎక్కువైతే అందులో కాస్త కొబ్బరి పాలు కలిపి చుడండి.
Sunday, November 14, 2010
సౌందర్య చిట్కా
సౌందర్య చిట్కా
- ప్రతి రోజూ ఒంటికి మాయిశ్చరైజర్, బాదం ఆయిల్ లేదా నువ్వుల నూనె రాస్తుంటే చర్మం చలికి పొడిబారకుండా ఉంటుంది.
- శీతాకాలంలో చేతులకు ఆయిల్‌తో మర్దన చేయడం వల్ల ముడతలు తగ్గి చేతివేళ్ళు అందంగా తయారవుతాయి.
- చలికాలంలో పెదవులు పగులుతుంటే... రాత్రి పడుకోబోయే ముందు నెయ్యి, వెన్న, మరేదైనా నూనె రాస్తే పెదవులు మృదువుగా ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుడు జెల్ వంటివి రాసుకోవచ్చు.
Friday, November 12, 2010
వంటింటి చిట్కాలు 6
వంటింటి చిట్కాలు 6
- పొట్టు తీసిన ఉల్లిపాయలను వెంటనే వాడకపోతే పేపర్ లో చుట్టి వెలుతురు తగలని చోట ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయ్.
- పాత్రలకు జిడ్డు ఎక్కువగా ఉంటె వేడి నీళ్ళలో వెనిగర్ వేసి సబ్బు తో కడిగితే తల తల మెరుస్తాయి.
Thursday, November 11, 2010
చిట్కాలు
చిట్కాలు
- నానబెట్టిన మినపప్పు , పెసరపప్పు లను వెంటనే వాడకపోతే నీళ్ళు వంపేసి.. పాలితిన్ సంచిలోకి తీసుకుని డీప్ ఫ్రిజ్ లో పెడితే రెండు రోజులదాకా ఫ్రెష్ గా ఉంటుంది.
- దుస్తుల మీద నూనె పడితే ఆ ప్రాంతంలో వరిపిండి చల్లి ఉతికితే మరకలు సులువుగా వదిలిపోతాయ్.
గోధుమ రవ్వ పురుగు పట్టకుండా ఉండాలంటే
గోధుమ రవ్వ పురుగు పట్టకుండా ఉండాలంటే
గోధుమ రవ్వ పురుగు పట్టకుండా ఉండాలంటే డబ్బాలో కాస్త ఉప్పును మూట కట్టి వెయ్యండి.
Tuesday, November 9, 2010
వెండి రంగు మారకుండా ఉండాలంటే...
వెండి రంగు మారకుండా ఉండాలంటే...
వెండి సామాగ్రి బద్ర పరిచే డబ్బాలో చిన్న సుద్ధ ముక్క వెయ్యండి.అది తేమను పీలుస్తుంది. దాంతో వెండి ఎక్కువ కాలం రంగు మారకుండా ఉంటుంది.
Tuesday, November 2, 2010
వంటింటి చిట్కా 5
వంటింటి చిట్కా 5
పంచదారకు చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో రెండు లవంగాలు ఉంచితే సరి...
Sunday, October 31, 2010
వంటింటి చిట్కా 4
వంటింటి చిట్కా 4
- కోడిగుడ్డు సొనకు కాస్త వెన్న కలిపితే ఆమ్లెట్ పొంగినట్లు వస్తుంది. రుచిగా కూడా ఉంటుంది.
- గ్రేవీ తయారీలో నునేకు బదులు వెన్న వాడితే అదనపు రుచి వస్తుంది.
Saturday, October 30, 2010
సౌందర్య చిట్కా 6
సౌందర్య చిట్కా 6
బొప్పాయి, అరటి ముక్కలను మెత్తగా చేసి అందులో నాలుగు చెంచాల ఆలివ్ నూనె, కొద్దిగా పెరుగు, గుడ్డు లోని తెల్ల సోన కలిపి మాడుకు పట్టించాలి. గంటయ్యాక షాంపు తో తలస్నానం చెయ్యాలి. ఇది కండిషనరగా ఉపయోగపడుతుంది.
Friday, October 29, 2010
సౌందర్య చిట్కా 5
సౌందర్య చిట్కా 5
టేబుల్ స్పూన్ నారింజపండు రసంలో టేబుల్ స్పూన్ పచ్చిపాలు కలిపి ముఖానికి చేతులకు క్రమం తప్పకుండా పట్టిస్తే మచ్చలు, చర్మ సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
Thursday, October 28, 2010
సౌందర్య చిట్కా 4
సౌందర్య చిట్కా 4
గోరువెచ్చటి నీటిలో కాటన్ ముంచి ముఖాన్ని శుబ్రపర్చాలి.దీనితో ముఖం ఫై ఉన్న రంద్రాలు తెరుచుకుంటాయీ. ఆ తరవాత టేబుల్ స్పూన్ తేనే లో కొద్దిగా బాదాం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం ఫై అప్లై చేసి, వేళ్ళతో వ్యతిరేక దిశలో మర్దనా చెయ్యాలి.15 నిముషాలు తరవాత చల్లటి నీటితో కడిగి వెయ్యాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కాంతి వంతావుతుంది.
Wednesday, October 27, 2010
సౌందర్య చిట్కాలు 3
సౌందర్య చిట్కాలు 3
- ముకం జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా? ఐతే ఇలా చెయ్యండి. రెండు చెంచాల సెనగపిండిలో చిటికెడు పసుపు, కాసిని పలు కలిపి ముద్దలా తయారుచేసి ముకానికి పూతల వెయ్యండి.పావు గంట అయ్యాక కదిగివేస్తే జిడ్డు, మృత కణాలు తొలగిపో యీ చర్మం శుబ్రపడుతుంది.
- రెండు చెంచాల పెసరపిండితో చిటికెడు పసుపు, అర చెంచా తేనే, పెరుగు కలిపి ముకానికి మర్దన చేసి అరగంట అయ్యాక శుబ్రపరుచుకోవాలి. ఇలా తరుచు చెయ్యడం వలన చర్మం మృదు వుగా తయారవు తుంది .
Tuesday, October 26, 2010
వంటింటి చిట్కా 3
వంటింటి చిట్కా 3
కట్ లెట్, టిక్కిలు వంటివి చేసేటప్పుడు..బంగాలదుంపను ఉడికించి చల్లార్చి ఉపయోగిస్తే రుచిగా ఉంటాయ్.
సౌందర్య చిట్కా 2
సౌందర్య చిట్కా 2
పెద్ద కారట్స్ - రెండుతేనె - రెండు టేబుల్ స్పూన్లు
ముందుగా క్యారట్స్‌ను ఉడకబెట్టి, పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత చన్నీటితో కడిడేయాలి. దీనివల్ల చర్మానికి నిగారింపు పెరగడంతోబాటు ముఖం మీద ఏర్పడ్డ మచ్చలు కూడా తగ్గుతాయి.
Monday, October 25, 2010
ముడతల నివారణ కోసం...
ముడతల నివారణ కోసం...
టేబుల్ స్పూన్ పాల మీది మీగడలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. పడుకోబోయే ముందు ఈ మిశ్రమంతో ముఖం మీద వలయాకారంలో పది నిమిషాల పాటు మర్దనా చేయాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
Sunday, October 24, 2010
వంటింటి చిట్కా2
వంటింటి చిట్కా
- తడి మసాలాను తక్కువ మంట మీద వేయీ స్తే రంగు కోల్పోకుండా రుచిగా ఉంటుంది.
- కచోరి తయారికి ఉపయోగించే పిండి లో చెంచా వేడి నూనె వేస్తె చక్కగా వస్తాయీ .
- నూడిల్స్ ను ఉడికించిన వెంటనే చల్లటి నీళ్ళలో వేస్తే అతుక్కోకుండా వేటికవి విడిగా వస్తాయ్.
- గసగసాలను పావుగంట నానబెట్టి రుబ్బితే ముద్ద మెత్త గా అవుతుంది.
Saturday, October 23, 2010
సౌందర్య చిట్కా1
సౌందర్య చిట్కా
బొప్పాయి గుజ్జుతో ముఖాన్ని వలయాకారంలో 10 నిమిషాల పాటు రుద్ది, అరగంట తరవాత కడిగేస్తే చర్మం నిగారిస్తుంది.
Wednesday, October 20, 2010
వంటింటి చిట్కాలు
వంటింటి చిట్కాలు
- గ్రేవీ చక్కటి రంగు రావాలి అంటే అందులో ఎర్రగా పండిన టమాటాలను సన్నగా కోసి కలిపి చుడండి.
- బంగాళా దుంపల ముక్కలు రంగు మారకుండా ఉండాలి అంటే...తరిగిన వెంటనే నీళ్ళలో వెయ్యాలి .
Tuesday, October 19, 2010
సౌందర్య చిట్కా
సౌందర్య చిట్కా
మొటిమలు సమస్య బాదిస్తుందా? దోసకాయను తరిగి మిక్సిలో మెత్తగా రుబ్బి రాసుకోవాలి. పావుగంట అయ్యాన తరువాత చేత్తో మర్దన చేసి కదిగివేస్తే ఫలితం ఉంటుంది.నజరానా
- పట్టు చీరల జరీ నల్లబడకుండా ఉండాలంటే వాటిని తిరగ మడతపెట్టి పాత దిండు గలేబిలో బద్రపర్చండి.
- బంగాలదుంపలు ఉడికించిన నీళ్ళలో పసుపు,డిటర్జెంట్ పౌడర్ కలిపి బంగారు ఆబరణాలు నానబెట్టి కడిగితే కొత్త వాటిల మెరుస్తాయి.
- ఎండబెట్టి పొడిచేసిన పోదినాను వంటింట్లో అక్కడక్కడ చల్లండి..ఇలా చేస్తే చీమల బెడద మాయం.
- వంటింటి సింక్ ను శుబ్రం చేయాలి అంటే సబ్బు నీటిలో కాస్తంత వంట సోడా వేసి కడిగి చూడండి.
- లెదర్ బ్యాగ్ ఫై సిరా, లిప్ స్టిక్ మరకలు పడితే వాటిని నీటితో కాకుండా రబ్బర్ తో రుద్దితే మరకలు మాయం.
Subscribe to:
Posts (Atom)