సున్నితమైన పెదవుల కోసం
చలికాలంలో పెదవులు పొడిబారి, పగిలి నిర్జీవంగా కనిపిస్తాయి. ఒక్కోసారి పెదవులపై డెడ్ స్కిన్ ఏర్పడుతుంది. దీనిని బలవంతంగా లాగితే రక్తం వస్తుంది. కాబట్టి ఈ సీజన్‌లో పెదవులు సున్నితంగా ఉండేలా తగినంత శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లోనే దొరికే పదార్థాలతో కొన్ని చిట్కాలు మీ కోసం....
- పుదీనా లేదా కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుని ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
- కొన్ని గులాబీ రేకులను పేస్ట్ చేసి అందులో గ్లిజరిన్ చుక్కలు వేసి రాత్రి పడుకునేటప్పుడు పెదవులకు రాసుకుని ఉదయం కడుక్కోవాలి.
- ఉదయం లేవగానే పెదవులకు తేనె లేదా పాలమీగడ రాసుకుని పావుగంట సేపు ఉంచుకుని కడిగేయాలి. ఇలా నెలరోజుల పాటు చేస్తే పెదవులు సున్నితంగా ఉండడంతో పాటు గులాబీరంగులోకి వస్తాయి.
- రాత్రి పడుకునేటప్పుడు కాటన్‌తో పెదవులను తుడుచుకుని కొబ్బరినూనె లేదా వెన్నను వేలితో అప్లై చేసి రెండుమూడు నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేయాలి.
No comments:
Post a Comment