Monday, February 28, 2011

మొటిమలు తగ్గాలంటే

 మొటిమలు తగ్గాలంటే
  1. బాదంపప్పును పాలతో కలిపి చిక్కటి పేస్టు చేసి మొటిమలపై రాయండి. మొటిమలు మెత్తబడి త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా పడవు.
  2. ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలు నీటిలో నానబెట్టి పేస్టు చేసి మొటిమలపై రాసి అరగంట తర్వాత చన్నీటిలో కడిగితే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.

దుస్తులపై నూనె మరకలు పడిన వెంటనే

దుస్తులపై నూనె మరకలు పడిన వెంటనే
దుస్తులపై నూనె మరకలు పడిన వెంటనే.. కొద్దిగా వంటసోడా లేదా మొక్కజొన్న పిండి చల్లి.. ఆ తరవాత దులిపేయండి. ఇది నూనెను పీల్చేస్తుంది.

Thursday, February 24, 2011

ముడతలు తగ్గాలంటే...

ముడతలు తగ్గాలంటే...

టీ స్పూన్ ఓట్స్ పొడిలో టీ స్పూన్ ఆపిల్ గుజ్జు, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పచ్చిపాలు కలిపి, ముఖానికి రాసి 20 ని.ల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగాలి. వారానికి రెండుసార్లిలా చేస్తే ముడతలు తగ్గుతాయి.

Wednesday, February 23, 2011

సౌందర్య చిట్కా

 సౌందర్య చిట్కా 
రెండు టీ స్పూన్ల పచ్చిపాలలో రెండు టీ స్పూన్ల ఓట్స్ పొడి, చిటికెడు చందనంపొడి, చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కోమలంగా తయారవుతుంది.

Sunday, February 20, 2011

బూట్లను విడిచిన వెంటనే దుర్వాసన వస్తుంటే

 బూట్లను విడిచిన వెంటనే దుర్వాసన వస్తుంటే
బూట్లను విడిచిన వెంటనే వాటిలో కొద్దిగా బేకింగ్‌ సోడాని ఉంచితే అది దుర్వాసనని పీల్చుకుంటుంది.

Thursday, February 17, 2011

వెల్లుల్లిపాయల పొట్టు సులువుగా రావాలంటే

 వెల్లుల్లిపాయల పొట్టు సులువుగా రావాలంటే

 
వెల్లుల్లిపాయలకు కొన్ని చుక్కలు నూనె పట్టించి రోజుంతా ఎండలో ఉంచండి. సాయంత్రం దళసరి వస్త్రంలో రెబ్బల్ని ఉంచి.. గట్టిగా రుద్దితే పొట్టు సులువుగా వూడివచ్చేస్తుంది.

Monday, February 14, 2011

చుండ్రు నివారణకు...

 చుండ్రు నివారణకు...
ఒక కప్పు పెరుగులో, టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తల కుదుళ్లకు బాగా పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చొప్పున రెండు నెలలపాటు చేస్తే చుండ్రు పోతుంది.

Sunday, February 6, 2011

మొటిమలతో వచ్చిన మచ్చలు తగ్గాలంటే...

 మొటిమలతో వచ్చిన మచ్చలు తగ్గాలంటే...
మొటిమలతో వచ్చిన మచ్చలు తగ్గాలంటే... వేపాకులను మెత్తగా పేస్ట్ చేసి చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని మచ్చలు ఉన్నచోట పలుచని పొరలా అప్లై చేసి, పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తేడా కనిపిస్తుంది.

గారెల పిండి పలచగా ఉంటే

 గారెల పిండి పలచగా ఉంటే
 
 
గారెల పిండి పలచగా ఉంటే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. అందుకని ఆ పిండిలో రెండు టీ స్పూన్ల నెయ్యి కలిపితే నూనె లాగడం తగ్గి గారెలు చక్కగా వస్తాయి.

Friday, February 4, 2011

ఎరుపురంగు దుస్తులు రంగు వెలుస్తుంటే

 ఎరుపురంగు దుస్తులు రంగు వెలుస్తుంటే
ఎరుపురంగు దుస్తులు ఉతుకుతున్నప్పుడు రంగు వెలిసిపోతుంటాయి ఒక్కోసారి. అలా కాకుండా ఉండాలంటే.. ఆ దుస్తులను ఓసారి అరకప్పు వెనిగర్‌ కలిపిన నీటిలో కాసేపు ఉంచి ఆ తరవాత ఉతకండి.

Thursday, February 3, 2011

మందంగా ఉన్న వస్త్రాలను కుట్టడం కష్టంగా ఉంటె

 మందంగా ఉన్న వస్త్రాలను కుట్టడం కష్టంగా ఉంటె 
కాస్త మందంగా ఉన్న వస్త్రాలను కుట్టడం కొన్నిసార్లు కష్టమవుతుంటుంది. అలాంటప్పుడు ఆ వస్త్రంపై ముందుగా కొవ్వొత్తి రుద్ది కుడితే మీ పని సులువు.

Wednesday, February 2, 2011

కేశాలకు ప్రొటీన్ ప్యాక్...

కేశాలకు ప్రొటీన్ ప్యాక్...
ఒక బౌల్‌లోకి అర కప్పు పెసరపిండి తీసుకుని దానిలో కీరా ముక్కల తురుము, ఆరెంజ్ జూస్, ఒక కోడిగుడ్డు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను నిలవ ఉంచకుండా తాజాగా ఉన్నప్పుడే ఉపయోగించాలి. ముందు రోజు సాయంత్రం షాంపూతో తలస్నానం చేసి మర్నాడు ఉదయం ఈ ప్యాక్‌ను జుట్టు మొత్తం పట్టించాలి. 20 నిమిషాలపాటు ప్యాక్‌ను ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టుకు పోషణ లభించి ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.

ఆకుకూర వండేటప్పుడు

 ఆకుకూర వండేటప్పుడు
ఆకుకూర వండేటప్పుడు అందులో జీలకర్రపొడి వేస్తే కూర సువాసన వస్తుంది. కమ్మగానూ ఉంటుంది.

Tuesday, February 1, 2011

చర్మం కాంతిమంతంగా ఉండాలంటే

 చర్మం కాంతిమంతంగా ఉండాలంటే
రెండు టీ స్పూన్ల అరటిపండు గుజ్జులో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పచ్చిపాలు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదారు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కాంతిమంతంగా ఉంటుంది.

కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే

కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే 
 కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే నిమిషం పాటు గోరువెచ్చని  నీటిలో నానబెట్టి గరుకు రాయి తో రెండు రోజుల పాటు రుద్దితే  కాళ్ళ పగుళ్ళు తగ్గుముఖం పడతాయి.

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo