మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోపాటు ముడతలు పోతాయి.
టీ స్పూన్ శనగపిండిలో అయిదారు చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మొటిమలు, నల్లమచ్చలు, చర్మం మీద ఉన్న జిడ్డు తగ్గి ముఖం కాంతిమంతంగా అవుతుంది
టీ స్పూన్ తేనెలో కోడిగుడ్డులోని తెల్ల సొన కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగితే జిడ్డు తగ్గి చర్మం అందంగా, కోమలంగా ఉంటుంది.
ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. టీ స్పూన్ తేనెలో అయిదారు చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం గల రంధ్రాల్లో చేరిన మురికి వదులుతుంది, చర్మం నునుపుదేలుతుంది.
నిమ్మరసంలో ఉప్పు కలిపి రాగి సామాగ్రిని తోమితే కొత్త వాటిల మెరుస్తాయి. వండిన బాణిలో పదార్ధాలు అంటుకుపోతే అందులో సబ్బు నీళ్ళు పోసి కొద్ది సేపు మరగించి శుబ్రపరిస్తే సరి
టీ స్పూన్ పచ్చిపాలలో అయిదారు చుక్కల తులసి రసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ ముంచి ముఖానికి, మెడకి అప్లై చేసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు తగ్గి ముఖం పొడిబారకుండా ఉండి చర్మం నిగనిగలాడుతుంది.
ఒక టీ స్పూన్ బాదమ్ ఆయిల్‌లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి మాస్క్ వేసుకుని పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం నునుపుదేలి అందంగా మెరుస్తూ ఉంటుంది.
శీతాకాలంలో సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. స్నానంచేసే ముందు ఒంటికి బాదమ్ ఆయిల్ పట్టించి సున్నిపిండి రాసి మర్దన చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే ఒంటిపై ముడ తలు, దురద తగ్గి చర్మం నునుపుదేలు తుంది. మర్దనతో రక్తప్రసరణ మెరగవుతుంది. చర్మ సౌందర్యంతోపాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది.
ఎండకు కమిలిన చర్మానికి... ఒక టీ స్పూన్ టొమాటో గుజ్జులో ఒక టీ స్పూన్ పుల్లటి పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా రాస్తే, రెండు- మూడు రోజుల్లో చర్మం కోమలమవుతుంది.
చలికాలంలో పెదవులు పొడిబారి, పగిలి నిర్జీవంగా కనిపిస్తాయి. ఒక్కోసారి పెదవులపై డెడ్ స్కిన్ ఏర్పడుతుంది. దీనిని బలవంతంగా లాగితే రక్తం వస్తుంది. కాబట్టి ఈ సీజన్‌లో పెదవులు సున్నితంగా ఉండేలా తగినంత శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లోనే దొరికే పదార్థాలతో కొన్ని చిట్కాలు మీ కోసం....
పుదీనా లేదా కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుని ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
కొన్ని గులాబీ రేకులను పేస్ట్ చేసి అందులో గ్లిజరిన్ చుక్కలు వేసి రాత్రి పడుకునేటప్పుడు పెదవులకు రాసుకుని ఉదయం కడుక్కోవాలి.
ఉదయం లేవగానే పెదవులకు తేనె లేదా పాలమీగడ రాసుకుని పావుగంట సేపు ఉంచుకుని కడిగేయాలి. ఇలా నెలరోజుల పాటు చేస్తే పెదవులు సున్నితంగా ఉండడంతో పాటు గులాబీరంగులోకి వస్తాయి.
రాత్రి పడుకునేటప్పుడు కాటన్‌తో పెదవులను తుడుచుకుని కొబ్బరినూనె లేదా వెన్నను వేలితో అప్లై చేసి రెండుమూడు నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేయాలి.
పచ్చళ్ళను నిలవ చేసే గాజు సీసాలు, జాడీలను కొంచెంసేపు ఎండలో పెట్టాలి. అలా చేయడం వల్ల అందు లో నీళ్లన్నీ ఎండిపోయి పచ్చళ్ళు బూజుపట్టకుండా ఎక్కువ కాలం నిలవ ఉంటాయి.
పెరిగే వయసును అద్దంలా ప్రతిబింబింపజేసేది చర్మం. అందులోనూ చలికాలంలో మరీ ఎక్కువ ముడతలు పడుతుంది. అందుకే ఈ కాలంలో వార్ధక్య లక్షణాలకు చెక్‌పెట్టే హోమ్‌మేడ్ ఫేషియల్ మాస్క్:
ఒక నిమ్మకాయను తీసుకుని, గింజలు వేరుచేసి, అందులో ఒక స్పూను మీగడ వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి పొరలా ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత తీసేసి ముఖానికి ఫేషియల్ క్రీమ్ రాసి మర్దన చేయాలి. ముడతలు పడిన చర్మానికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.
ఉడెన్ ఫర్నిచర్‌ను పేపర్‌తో తుడిస్తే పాలిష్ చేసినట్లు మెరుస్తాయి. పేపర్‌తో తుడవడం వల్ల సందుల్లోని దుమ్ము పూర్తిగా వదలదు కాబట్టి ముందుగా మెత్తటి క్లాత్‌తో తుడిచి, తర్వాత పేపర్‌తో తుడవాలి.
కూరలో కారం ఎక్కువైతే అందులో కాస్త కొబ్బరి పాలు కలిపి చుడండి.
ప్రతి రోజూ ఒంటికి మాయిశ్చరైజర్, బాదం ఆయిల్ లేదా నువ్వుల నూనె రాస్తుంటే చర్మం చలికి పొడిబారకుండా ఉంటుంది.
శీతాకాలంలో చేతులకు ఆయిల్‌తో మర్దన చేయడం వల్ల ముడతలు తగ్గి చేతివేళ్ళు అందంగా తయారవుతాయి.
చలికాలంలో పెదవులు పగులుతుంటే... రాత్రి పడుకోబోయే ముందు నెయ్యి, వెన్న, మరేదైనా నూనె రాస్తే పెదవులు మృదువుగా ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుడు జెల్ వంటివి రాసుకోవచ్చు.
నానబెట్టిన మినపప్పు , పెసరపప్పు లను వెంటనే వాడకపోతే నీళ్ళు వంపేసి.. పాలితిన్ సంచిలోకి తీసుకుని డీప్ ఫ్రిజ్ లో పెడితే రెండు రోజులదాకా ఫ్రెష్ గా ఉంటుంది.
దుస్తుల మీద నూనె పడితే ఆ ప్రాంతంలో వరిపిండి చల్లి ఉతికితే మరకలు సులువుగా వదిలిపోతాయ్.