బ్లాక్ హెడ్స్ పోవాలంటే...
ముందుగా మూడు కప్పుల నీటిని మరిగించి, అందులో రెండు టేబుల్ స్పూన్ల వంటసోడా వేసి, ఈ నీటిలో టవల్‌ను ముంచి ముఖానికి అద్దుతూ ఉండాలి. ఇలా ఐదారుసార్లు చేసిన తర్వాత వరిపిండిలో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రాసి ఐదు నిమిషాల పాటు వలయాకారంగా రుద్దాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి.Tuesday, March 15, 2011
పుదీనా పచ్చడి చేసేటప్పుడు
పుదీనా పచ్చడి చేసేటప్పుడు
పుదీనా పచ్చడి చేసేటప్పుడు కొద్దిగా పెరుగు కూడా కలిపితే రంగూ రుచీ బాగుంటాయి.
Monday, March 14, 2011
మొటిమలు పోవాలంటే
మొటిమలు పోవాలంటే
- బాదంపప్పును పాలతో కలిపి చిక్కటి పేస్టు చేసి మొటిమలపై రాయండి. మొటిమలు మెత్తబడి త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా పడవు.
- ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలు నీటిలో నానబెట్టి పేస్టు చేసి మొటిమలపై రాసి అరగంట తర్వాత చన్నీటిలో కడిగితే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.
చపాతి పిండి పల్చగా అయి రోటీలు చేయడానికి వీలులేకుండా ఉంటే
చపాతి పిండి పల్చగా అయి రోటీలు చేయడానికి వీలులేకుండా ఉంటే
చపాతి పిండి పల్చగా అయి రోటీలు చేయడానికి వీలులేకుండా ఉంటే ఓ ఐదునిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టండి.
Sunday, March 13, 2011
పేస్ ప్యాక్
పేస్ ప్యాక్
నాలుగైదు స్ట్రాబెర్రీలను మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలకు రెండు మూడు సార్లు చేస్తే చర్మం నునుపుగా ఉండి, మంచి ఛాయ వస్తుంది.వంటింటి చిట్కా
వంటింటి చిట్కా
కప్పు నీటిలో వాడేసిన నిమ్మచెక్కలు, లవంగాలు వేసి మరిగించి దాన్ని ఓవెన్‌లో ఉంచితే.. పదార్థాల తాలూకు వాసనలు రావు. Thursday, March 10, 2011
ఉడికించిన బంగాళాదుంపలను
ఉడికించిన బంగాళాదుంపలను
ఉడికించిన బంగాళాదుంపలను ఎగ్ స్త్లెసర్‌తో కోస్తే ముక్కలు చక్కగా వస్తాయి.
Tuesday, March 8, 2011
ఎండలో బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ముఖాన్ని
ఎండలో బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ముఖాన్ని
- ఎండలో బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ముఖాన్ని కీరదోస ముక్కతో రుద్ది కడిగితే చర్మం నల్లబడదు.
- గోళ్లు పెళుసుబారి విరుగుతుంటే... రసం పిండేసిన నిమ్మచెక్కతో రుద్దాలి.
- మోచేతుల దగ్గర చర్మం మృదువుగా రావాలంటే ముల్లంగి ముక్కతో రుద్దాలి లేదా ముల్లంగా రసాన్ని రాస్తే సరి.
Sunday, March 6, 2011
ఇంట్లో గాజు వస్తువులు పగిలినప్పుడు
ఇంట్లో గాజు వస్తువులు పగిలినప్పుడు
ఇంట్లో గాజు వస్తువులు పగిలినప్పుడు మెత్తగా ఉన్న బ్రెడ్‌తో నేలను తుడిస్తే ముక్కలన్ని అతు క్కుపోతాయి.
Thursday, March 3, 2011
పెదవులు నల్లగా ఉంటే
పెదవులు నల్లగా ఉంటే
పెదవులు నల్లగా ఉంటే... కొద్దిగా వెన్న తీసుకుని రెండు గ్లిజరిన్ చుక్కలు వేసి కలిపి రాయాలి. ఇలా వారానికి మూడు-నాలుగు సార్లు రాస్తుంటే క్రమంగా నలుపు వదిలి పెదవులు ఆకర్షణీయంగా మారుతాయి.ఓవెన్‌లో దుర్వాసనలు వస్తుంటే
ఓవెన్‌లో దుర్వాసనలు వస్తుంటే
దాల్చిన చెక్క పొడిలో చిటికెడు ఉప్పు కలిపి ఓవెన్‌లో ఉంచితే అందులో నుంచి వచ్చే దుర్వాసనలు దూరమవుతాయి.
Wednesday, March 2, 2011
దుస్తులపై పడిన సిరా మరకలు పోవాలంటే
దుస్తులపై పడిన సిరా మరకలు పోవాలంటే
దుస్తులపై పడిన సిరా మరకలు పోవాలంటే.. ఆ ప్రాంతంపై ఉప్పు చల్లి.. ఆ తరవాత గోరువెచ్చని నీటితో ఉతికి ఆరేయండి. Tuesday, March 1, 2011
సౌందర్య చిట్కా
సౌందర్య చిట్కా
మూడు టీస్పూన్ల టొమాటో రసంలో టీస్పూను తేనె కలిపి ముఖానికి రాసుకుంటూ ఉంటే, కొద్దిరోజుల్లోనే కాంతివంతమైన ఛాయ మీ సొంతమవుతుంది.బెండకాయ వేపుడు చేస్తున్నప్పుడు
బెండకాయ వేపుడు చేస్తున్నప్పుడు
బెండకాయ వేపుడు చేస్తున్నప్పుడు నూనె ఎక్కువగా పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. కొద్దిగా పెరుగు వేయండి. దానివల్ల కూరముక్కలు ఒకదానికి ఒకటి అతుక్కోవు.
Subscribe to:
Posts (Atom)