Thursday, December 30, 2010

టమాటా సూప్‌కి చక్కని రంగు రావాలంటే

 టమాటా సూప్‌కి చక్కని రంగు రావాలంటే
ఇంట్లో చేసుకొనే టమాటా సూప్‌కి చక్కని రంగు రావాలంటే అందులో చిన్న బీట్‌రూట్‌ ముక్క వేస్తే రంగూ, పోషకాలు రెండూ ఉంటాయి.

Wednesday, December 29, 2010

సబ్బు ముక్కలు మిగిలిపోతే

సబ్బు ముక్కలు మిగిలిపోతే 


సబ్బు ముక్కలు మిగిలిపోతే వాటిని సన్నగా తరిగి సర్ఫ్ లో కలిపి బట్టలు ఉతికితే మంచి వాసన  వస్తాయ్ .

పేస్ ప్యాక్

 పేస్ ప్యాక్
రెండు స్పూన్ల తొక్కతీసిన టొమాటో గుజ్జులో నాలుగు టీ స్పూన్ల అరటిపండు గుజ్జు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

Tuesday, December 28, 2010

ఎండకు ముఖం కమిలితే

 ఎండకు ముఖం కమిలితే
ఎండకు ముఖం కమిలితే రెండు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో చిటికెడు చందనం పొడి కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలు చేస్తే చర్మం తిరిగి కాంతివంతగా ఉంటుంది.

గిన్నె అడుగు మాడినప్పుడు...

 గిన్నె అడుగు మాడినప్పుడు...
గిన్నె అడుగు మాడినప్పుడు దానిని ఎక్కువసేపు కష్టపడి తోమకుండా ఆ గిన్నెలో కొద్దిగా డిష్ సోప్ వేసి నీళ్లు పోసి కొంచెంసేపు చిన్న మంట మీద ఉంచాలి. ఆ తరువాత కడిగితే బాగా శుభ్రపడుతుంది.

Monday, December 27, 2010

ముఖం ఫై ముడతలు తగ్గాలంటే

 ముఖం ఫై ముడతలు తగ్గాలంటే 


కోడిగుడ్డు తెల్ల సొనలో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ముడతలు తగ్గుతాయి.

Sunday, December 26, 2010

గాజు వస్తువులను వాడేసిన టీ పొడితో రుద్ది కడిగితే

గాజు వస్తువులను వాడేసిన టీ పొడితో రుద్ది కడిగితే వాటిమీద పడిన మరకలు త్వరగా వదిలి శుభ్రపడతాయి.

కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే

 కాళ్ళ  పగుళ్లు తగ్గాలంటే
 
 

చలికాలంలో పాదాలు పగులుతుంటాయి. ఈ పగుళ్లు తగ్గాలంటే... అర కప్పు కొబ్బరి నూనెలో 10 వేపాకులు, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా రెండు వారాల పాటు పాదాలకు రాసుకుంటే పగుళ్ళు తగ్గి మృదువుగా తయారవుతాయి.

Thursday, December 23, 2010

ముఖం కాంతివంతం కావాలంటే

 ముఖం కాంతివంతం కావాలంటే
ముఖం కాంతివంతం కావాలంటే... రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను పట్టించి 20 నిమిషాల పాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి

చొక్కా కాలర్‌ బాగా మురికి పట్టి నల్లగా అయితే

 చొక్కా కాలర్‌ బాగా మురికి పట్టి నల్లగా అయితే
చొక్కా కాలర్‌ బాగా మురికి పట్టి నల్లగా అయితే ఆ ప్రాంతంలో టాల్కమ్‌ పౌడర్‌ను చల్లి సబ్బుతో ఉతికితే సులువుగా శుభ్రపడుతుంది.

Wednesday, December 22, 2010

కోమలమైన చర్మం కోసం

 కోమలమైన చర్మం కోసం

కోమలమైన చర్మం కోసం రెండు స్పూన్ల కారట్ గుజ్జు, రెండు స్పూన్ల టొమాటో గుజ్జు కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నునుపవుతుంది.

బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే

 బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే
 
బియ్యం నిల్వచేసిన డబ్బాలో గుప్పెడు పుదీనా ఆకులు వేస్తే పురుగులు పట్టవు

Tuesday, December 21, 2010

మొటిమలు తగ్గాలంటే

 మొటిమలు తగ్గాలంటే
చిటికెడు జీలకర్ర పొడిలో ఆరు చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని మొటిమల పై రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేస్తే మొటిమలు వాటి తాలూకు నల్ల మచ్చలు తగ్గుతాయి.

వేయించేటప్పుడు పచ్చిమిర్చి పేలకుండా ఉండాలంటే

 వేయించేటప్పుడు పచ్చిమిర్చి పేలకుండా ఉండాలంటే 



పచ్చిమిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి.

Monday, December 20, 2010

మట్టి మరకలు త్వరగా వదలాలంటే

 మట్టి మరకలు త్వరగా వదలాలంటే
 
బంగాళాదుంపలు ఉడికించిన నీళ్లలో మట్టి మరకలు పడిన దుస్తులను నానబెడితే మరకలు త్వరగా  వదులుతాయి.

Sunday, December 19, 2010

కుకుంబర్ ఫేస్ మాస్క్

కుకుంబర్ ఫేస్ మాస్క్
కుకుంబర్, ఓట్‌మీల్, పాలమీగడ అన్నీ సమపాళ్ళలో తీసుకుని ముఖానికి బాగా మర్దనా చేయాలి. అరగంట పాటు బాగా ఆరనిచ్చి వేడినీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం నునుపుదేరి కాంతివంతమవుతుంది. 

నెయి మంచి వాసనా రావాలంటే

 నెయి మంచి వాసనా రావాలంటే

 
కాచిన నెయ్యిలో నాలుగు మెంతులు వేస్తే కమ్మటి వాసన వస్తుంది.

Wednesday, December 15, 2010

మచ్చలు లేని మోము కోసం...

మచ్చలు లేని మోము కోసం...
  • మచ్చలున్న చోట నిమ్మ చెక్కతో రుద్దాలి.

  • ఒక స్పూను తేనె, ఓట్‌మీల్, పెరుగు కలిపి ముఖానికి పట్టించి పదినిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.

  • ఒక స్పూన్ వెనిగర్‌ను వేడినీళ్లలో కలిపి మచ్చల మీద రాయాలి.

  • ఉల్లిరసంలో దూదిని నానబెట్టి పడుకోవడానికి ముందు పదిహేను నిమిషాల పాటు మచ్చల మీద మర్దన చేయాలి.
  • ఒక స్పూను ఉల్లిరసానికి ఒక స్పూను తేనె కలిపి మచ్చలున్న చోట రాయాలి.

Tuesday, December 14, 2010

దగ్గు తగ్గాలంటే

 దగ్గు తగ్గాలంటే
గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు పంచదార, పావు చెంచా పసుపు, కలిపి పుక్కిలిస్తే దగ్గు సమస్య తగ్గుముఖం పడుతుంది.

Monday, December 13, 2010

గొంతులో నసగా ఉన్నప్పుడు

 గొంతులో నసగా ఉన్నప్పుడు
 
 
గొంతులో నసగా ఉన్నప్పుడు అల్లం ముక్కను దంచి పాలలో వేసి మరిగించి చక్కెర కలిపి తాగితే సరి.
 చర్మం మెరుపు రావాలంటే 
 
 
టీ స్పూన్ చందనం పొడిలో టీ స్పూన్ పసుపు టీ స్పూన్ పచ్చిపాలు కలపాలి. అలా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది.

Sunday, December 12, 2010

క్యాబేజీ కూర వాసన రాకుండా ఉండాలంటే

 క్యాబేజీ కూర వాసన రాకుండా ఉండాలంటే 
క్యాబేజీ వండేటప్పుడు అందులో చెంచా నిమ్మరసం కలిపితే కూర వాసన రాకుండా ఉంటుంది.
* వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది.

జుట్టు నిగనిగ లాడాలంటే

 జుట్టు నిగనిగ లాడాలంటే
తలస్నానం చేసే ముందు ఒక గంట సేపు జుట్టుకి కొబ్బరినూనెను పట్టించాలి. పది స్పూన్ల హెన్నా పౌడర్‌లో నాలుగు స్పూన్ల పుల్లటి పెరుగు, రెండు స్పూన్ల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే జుట్టుకు పోషణ లభించి మెరుస్తూ ఉంటుంది.

Wednesday, December 8, 2010

నిద్రబాగా పట్టాలంటే

 నిద్రబాగా పట్టాలంటే 
గోరువెచ్చటి నీటిలో ఆరు చుక్కల రోజ్‌వాటర్ వేసి రాత్రి పడుకోబోయే ముందు స్నానం చేస్తే నిద్రబాగా పట్టడమే కాకుండా చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది.

పాత్రలు తళతళా మెరవాలంటే

 పాత్రలు తళతళా మెరవాలంటే 


వాడేసిన నిమ్మచెక్కలతో జిడ్డు సామాన్లను రుద్ది పాత పేపర్లతో తుడిచిన తర్వాత కడిగితే పాత్రలు తళతళా మెరుస్తాయి.

Sunday, December 5, 2010

కారంపొడి పురుగు పట్టకుండా ఉండాలంటే

కారంపొడి  పురుగు పట్టకుండా ఉండాలంటే 


కారంపొడి నిల్వ చేసిన డబ్బాలో చిన్న ఇంగువ ముక్క ఉంచితే పురుగు పట్టకుండా ఎక్కువ కాలం ఉంటుంది.

బాగా పండిన టమాటాలు పగిలిపోకుండా ఉండాలంటే

 బాగా పండిన టమాటాలు పగిలిపోకుండా ఉండాలంటే


బాగా పండిన టమాటాలు పగిలిపోకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళలో వెయ్యండి.

Saturday, December 4, 2010

పెదవులు ఫై నలుపు పోవాలంటే

 పెదవులు ఫై నలుపు పోవాలంటే 


టీ స్పూన్ అరటిపండు గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే నల్లని పెదవులు గులాబీరంగులోకి మారతాయి.

నిమ్మరసం మిగిలిపోతే

 నిమ్మరసం మిగిలిపోతే


నిమ్మరసం మిగిలిపోతే అందులో కొద్దిగా ఉప్పు వేసి ఫ్రిజ్ లో ఉంచండి. రెండు మూడు రోజులు వాడుకోవచ్చు.

వెండి సామాగ్రి మురికి పోవాలంటే

 వెండి సామాగ్రి మురికి పోవాలంటే 


నీళ్ళలో కాసిని  పచ్చి పాలు కలిపి వెండి సామాగ్రి కడిగితే మురికి సులువుగా వదిలిపోయి శుభ్ర పడతాయి.

Wednesday, December 1, 2010

కంటి కింద నలుపు తగ్గాలంటే

 కంటి కింద నలుపు తగ్గాలంటే 


రెండు స్పూన్ల చల్లని పాలలో కాటన్ బాల్స్‌ని ముంచి కళ్ళ చుట్టూ వలయాకారంగా మర్ధించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కంటి కింద నలుపు తగ్గి అందంగా ఉంటాయి. మరియు కీరదోసకాయని చక్రాల్లా కోసుకుని కళ్ళమీద పెట్టుకుంటే కంటి అలసట తగ్గుతుంది.

వంట గది గట్టు మీద జిడ్డు తొలగించాలంటే

 వంట గది గట్టు మీద జిడ్డు తొలగించాలంటే
  1. వంట గది గట్టు మీద జిడ్డు తొలగించాలంటే కాస్త వంట సోడా చల్లి పీచుతో రుద్ది కడిగితే శుబ్రపడుతుంది.
  2. ఆలివ్ నూనెలో కాస్త నిమ్మరసం కలిపి చెక్క సామాగ్రిని రుద్దితే పాలిష్ చేసినట్లు కనపడతాయి.
కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo