Thursday, December 30, 2010

టమాటా సూప్‌కి చక్కని రంగు రావాలంటే

 టమాటా సూప్‌కి చక్కని రంగు రావాలంటే
ఇంట్లో చేసుకొనే టమాటా సూప్‌కి చక్కని రంగు రావాలంటే అందులో చిన్న బీట్‌రూట్‌ ముక్క వేస్తే రంగూ, పోషకాలు రెండూ ఉంటాయి.

Wednesday, December 29, 2010

సబ్బు ముక్కలు మిగిలిపోతే

సబ్బు ముక్కలు మిగిలిపోతే 


సబ్బు ముక్కలు మిగిలిపోతే వాటిని సన్నగా తరిగి సర్ఫ్ లో కలిపి బట్టలు ఉతికితే మంచి వాసన  వస్తాయ్ .

పేస్ ప్యాక్

 పేస్ ప్యాక్
రెండు స్పూన్ల తొక్కతీసిన టొమాటో గుజ్జులో నాలుగు టీ స్పూన్ల అరటిపండు గుజ్జు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

Tuesday, December 28, 2010

ఎండకు ముఖం కమిలితే

 ఎండకు ముఖం కమిలితే
ఎండకు ముఖం కమిలితే రెండు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో చిటికెడు చందనం పొడి కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలు చేస్తే చర్మం తిరిగి కాంతివంతగా ఉంటుంది.

గిన్నె అడుగు మాడినప్పుడు...

 గిన్నె అడుగు మాడినప్పుడు...
గిన్నె అడుగు మాడినప్పుడు దానిని ఎక్కువసేపు కష్టపడి తోమకుండా ఆ గిన్నెలో కొద్దిగా డిష్ సోప్ వేసి నీళ్లు పోసి కొంచెంసేపు చిన్న మంట మీద ఉంచాలి. ఆ తరువాత కడిగితే బాగా శుభ్రపడుతుంది.

Monday, December 27, 2010

ముఖం ఫై ముడతలు తగ్గాలంటే

 ముఖం ఫై ముడతలు తగ్గాలంటే 


కోడిగుడ్డు తెల్ల సొనలో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ముడతలు తగ్గుతాయి.

Sunday, December 26, 2010

గాజు వస్తువులను వాడేసిన టీ పొడితో రుద్ది కడిగితే

గాజు వస్తువులను వాడేసిన టీ పొడితో రుద్ది కడిగితే వాటిమీద పడిన మరకలు త్వరగా వదిలి శుభ్రపడతాయి.
కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo