బొప్పాయి, అరటి ముక్కలను మెత్తగా చేసి అందులో నాలుగు చెంచాల ఆలివ్ నూనె, కొద్దిగా పెరుగు, గుడ్డు లోని తెల్ల సోన కలిపి మాడుకు పట్టించాలి. గంటయ్యాక షాంపు తో తలస్నానం చెయ్యాలి. ఇది కండిషనరగా ఉపయోగపడుతుంది.
టేబుల్ స్పూన్ నారింజపండు రసంలో టేబుల్ స్పూన్ పచ్చిపాలు కలిపి ముఖానికి చేతులకు క్రమం తప్పకుండా పట్టిస్తే మచ్చలు, చర్మ సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
గోరువెచ్చటి నీటిలో కాటన్ ముంచి ముఖాన్ని శుబ్రపర్చాలి.దీనితో ముఖం ఫై ఉన్న రంద్రాలు తెరుచుకుంటాయీ. ఆ తరవాత టేబుల్ స్పూన్ తేనే లో కొద్దిగా బాదాం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం ఫై అప్లై చేసి, వేళ్ళతో వ్యతిరేక దిశలో మర్దనా చెయ్యాలి.15 నిముషాలు తరవాత చల్లటి నీటితో కడిగి వెయ్యాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కాంతి వంతావుతుంది.
ముకం జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా? ఐతే ఇలా చెయ్యండి. రెండు చెంచాల సెనగపిండిలో చిటికెడు పసుపు, కాసిని పలు కలిపి ముద్దలా తయారుచేసి ముకానికి పూతల వెయ్యండి.పావు గంట అయ్యాక కదిగివేస్తే జిడ్డు, మృత కణాలు తొలగిపో యీ చర్మం శుబ్రపడుతుంది.
రెండు చెంచాల పెసరపిండితో చిటికెడు పసుపు, అర చెంచా తేనే, పెరుగు కలిపి ముకానికి మర్దన చేసి అరగంట అయ్యాక శుబ్రపరుచుకోవాలి. ఇలా తరుచు చెయ్యడం వలన చర్మం మృదు వుగా తయారవు తుంది .
పెద్ద కారట్స్ - రెండు
తేనె - రెండు టేబుల్ స్పూన్లు
ముందుగా క్యారట్స్‌ను ఉడకబెట్టి, పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత చన్నీటితో కడిడేయాలి. దీనివల్ల చర్మానికి నిగారింపు పెరగడంతోబాటు ముఖం మీద ఏర్పడ్డ మచ్చలు కూడా తగ్గుతాయి.
టేబుల్ స్పూన్ పాల మీది మీగడలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. పడుకోబోయే ముందు ఈ మిశ్రమంతో ముఖం మీద వలయాకారంలో పది నిమిషాల పాటు మర్దనా చేయాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.