Thursday, November 24, 2011

చలికాలం శిరోజాలకు మేలు చేసే ప్యాక్...

చలికాలం శిరోజాలకు మేలు చేసే ప్యాక్... 
మగ్గిన అరటిపండు, గుడ్డులోని తెల్లసొన, రెండు టేబుల్‌స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్ల పాలు, మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, కేశాలకు పట్టించి ఇరవై నిమిషాలు వదిలేసి,తర్వాత తలస్నానం చేయాలి. 

Monday, November 14, 2011

పచ్చి అరటి ముక్కలను ఒక ఉడుకు రానిచ్చి

పచ్చి అరటి ముక్కలను ఒక ఉడుకు రానిచ్చి తీసి వేయిస్తే అవి మృదువుగా వస్తాయ్. అలాగే రుచిగా ఉంటాయ్.

Monday, November 7, 2011

కొత్తిమీర మీర పొడి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే?

కొత్తిమీర మీర పొడి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే?
కొత్తిమీర మీర పొడికి కొద్దిగా ఉప్పు చేర్చి నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉండి మంచి వాసన వస్తుంది.

వాడని ప్లాస్క్ వాసన రాకుండా ఉండాలంటే

వాడని ప్లాస్క్ వాసన రాకుండా ఉండాలంటే 
 వాడని ప్లాస్క్ వాసన రాకుండా ఉండాలంటే రెండు లవంగాలు వేస్తె వాసన రాకుండా ఉంటాయీ.

Friday, November 4, 2011

చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే?

 చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే?
చిన్న కీరా ముక్కను మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో రెండు టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. రోజు విడిచి రోజు ఈ మిశ్రామాన్ని ప్యాక్‌లా వాడటం వల్ల చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.

Thursday, November 3, 2011

సౌందర్య చిట్కా

 సౌందర్య చిట్కా 
ఆలివ్ ఆయిల్‌ను రోజూ ముఖానికి రాసుకొని మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ వృద్ధి చెంది, చర్మం బిగుతుగా తయారవుతుంది.

చుండ్రు తగ్గాలంటే

 చుండ్రు తగ్గాలంటే 
ఆలివ్ ఆయిల్, తేనె సమపాళ్లలో తీసుకొని మాడుకు, కేశాలకు పట్టించాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది. పొడి జుట్టుకు ఆలివ్ ఆయిల్, తేనె కండిషనర్‌గా పనిచేస్తాయి.

Wednesday, November 2, 2011

సౌందర్య చిట్కా

 సౌందర్య చిట్కా 
ఆలివ్ ఆయిల్, పంచదారలను సమపాళ్లలో తీసుకొని మెడ, వీపు భాగాల మీద రాసి, 5-10 నిమిషాలు రబ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారంలో 3-4 సార్లు ఇలా చేస్తే నలుపు తగ్గి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

Tuesday, November 1, 2011

కుంకుడు లో ఔషధ విలువలు

కుంకుడు లో ఔషధ విలువలు
  1. కుంకుళ్లకు సమానంగా మిరియాలు కలిపి నీటితో నూరి, రసం తీసి 4, 5 చుక్కల రసాన్ని ముక్కులో వేసుకుని పీలిస్తే మైగ్రేన్ మటుమాయం అవుతుంది.  
  2. కుంకుడు గింజలను కాల్చి పొడి చేసి దానికి సమానంగా పొంగించి పొడి చేసిన పటికను కలిపి దానితో పళ్లు తోముకుంటుంటే పంటిజబ్బులు నశిస్తాయి. 
  3. కుంకుడు గింజలలో ఉండే పప్పును వెనిగర్‌లో కలిపి మెత్తగా నూరి విషకీటకాలు కుట్టినచోట లేపనం చేస్తే నొప్పి, మంట తగ్గుతాయి.
  4. కుంకుడు గింజలోని పప్పును చూర్ణం చేసి దానికి సమానంగా పాతబెల్లం కలుపుకుని కప్పు పాలలో కలుపుకుని తాగుతుంటే వీర్యవృద్ధి అవుతుంది.

బ్యూటీ టిప్స్

 బ్యూటీ టిప్స్
అరకప్పు ఓట్‌మీల్‌లో పావు కప్పు వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకొని ముఖానికి, మెడకు రాసి నెమ్మదిగా మర్దనా చేయాలి. మిగిలిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసి ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. మూడు-నాలుగు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది.
కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం మాలిక: Telugu Blogs haaram logo jalleda logo